AUS vs IND, Rishabh Pant: టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
Rishabh Pant Scores 2nd Fastest Test Fifty: రిషబ్ పంత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ వేసిన రెండో బంతికి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ ఓవర్ మూడో బంతికి సిక్సర్ కూడా బాదడం విశేషం. ఆ తర్వాత 61 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
Rishabh Pant Scores 2nd Fastest Test Fifty: శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐదో టెస్టులో రిషబ్ పంత్ తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సిడ్నీ టెస్ట్‌లో భారత ఆటగాడు చేసిన రెండో ఫాస్టెస్ట్ టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
పంత్ కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. గతంలో 2022లో శ్రీలంకపై 28 బంతుల్లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇది ఆస్ట్రేలియాలో విజిటింగ్ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన అర్ధశతకంగా నిలిచింది. ఇంగ్లండ్‌కు చెందిన జాన్ బ్రౌన్ (1895), రాయ్ ఫ్రెడరిక్స్ (1975) లు గతంలో 33 బంతుల్లో ఈ రికార్డును కలిగి ఉన్నారు.
వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇదే క్రమంలో వచ్చిన ప్రతీ బంతిపై ప్రతాపం చూపించిన రిషబ్ పంత్.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.
Half-century off just 29 deliveries 🔥
15th Test FIFTY for Rishabh Pant!
This has been an excellent counter-attacking batting display 👏👏
Live – https://t.co/NFmndHLfxu#TeamIndia | #AUSvIND | @RishabhPant17 pic.twitter.com/5fv0E16abh
— BCCI (@BCCI) January 4, 2025
అత్యంత వేగవంతమైన టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు..
1) రిషబ్ పంత్ – 28 బంతులు vs శ్రీలంక, 2022
2) రిషబ్ పంత్ – 29 బంతులు vs ఆస్ట్రేలియా, 2025
3) కపిల్ దేవ్ – 30 బంతులు vs పాకిస్తాన్, 1982
4) శార్దూల్ ఠాకూర్ – 31 బంతులు vs ఇంగ్లాండ్, 2021
5) యశస్వి జైస్వాల్ – 31 బంతులు vs బంగ్లాదేశ్, 2024.
సిడ్నీ టెస్టుకు ఇరు జట్లు..
భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..