Hyderabad: ధైర్యమున్నోళ్లే చూడండి.. భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే
రియల్‌గా యాక్సిడెంట్ చూశారా.? హైదరాబాద్‌లో జరిగింది ఈ ఘటనా. ఇంటర్నెట్‌లో అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అదేంటో మీరు ఇప్పుడే చూసేయండి. ఓ సారి ఈ స్టోరీలో లుక్కేయండి మరి. లేట్ ఎందుకు ఇది మీకోసమే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కారు బీభత్సం సృష్టించింది. నార్త్ బాలాజీహిల్స్ రోడ్డులో అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అయితే కారు ఢీకొన్న దెబ్బకు స్తంభం దెబ్బతిని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాద పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు మద్యం సేవించి వాహనం నడపడమే కారణమని స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం అనంతరం కారును గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తరలించేందుకు కొందరు ప్రయత్నించగా, అది గమనించిన స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా? వాహనంలో ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది చదవండి: ఒళ్లు గగుర్పొడుస్తున్న బాబా వంగా జోస్యం.. వామ్మో.! 2026 అత్యంత భయంకరంగా ఉంటుందా.?
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఎలక్ట్రికల్ స్తంభం దెబ్బతినడంతో విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. అదే సమయంలో ప్రమాద ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినా, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడంతో ట్రాఫిక్ పునరుద్ధరించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్టు నిర్ధారణ అయితే డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన పోలీసులు, రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
ఇది చదవండి: ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








