AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: గ్రాముల్లో కాదు.. కిలోల్లో.! పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా

ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసే గంజాయి క్రయ విక్రయాలు పరిధి దాటుతున్నాయి. ఏకంగా గంజాయి పంటలు సాగు చేసే స్థాయికి వెళ్ళింది. గ్రాములు కిలోలు స్థాయి దాటి ఏకంగా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra: గ్రాముల్లో కాదు.. కిలోల్లో.! పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
Kurnool
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Dec 21, 2025 | 10:30 AM

Share

ఇక్కడ చూడండి.. ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నది ఏ పశుగ్రాసము లేక ఏ పంటను కాదు. ఆరోగ్యాలను జీవితాలను సర్వనాశనం చేస్తున్న గంజాయిని ట్రాక్టర్లో తరలిస్తున్నారు. అవును ఇది నిజమే. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో కంది పొలంలో అంతర పంటగా గంజాయి సాగు అవుతుంది. కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దాడి చేసి విస్మయం వ్యక్తం చేశారు. ఆ పంటను నాశనం చేసి ట్రాక్టర్లలో తరలించారు. ఇది చాలు.. గంజాయి క్రయ విక్రయాలు పరిధి దాటుతున్నాయనేదానికి. డేగులపాడు గ్రామంలో శివయ్య అనే రైతు సర్వేనెంబర్ 173 176లలో పొలాన్ని కౌలుకు తీసుకొని కంది పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేశారు. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతుంది. ఈ పొలం కూడా ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించినది. దేవుడి మార్నింగ్ లో గంజాయి సాగు అవుతుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే. ఇది తెలిసిన వెంటనే రైతు శివయ్య పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఈ గంజాయి సాగు వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మాఫియా ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివయ్య దొరికితే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.

ఇది చదవండి: ఒళ్లు గగుర్పొడుస్తున్న బాబా వంగా జోస్యం.. వామ్మో.! 2026 అత్యంత భయంకరంగా ఉంటుందా.?

నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహానంది మండలం బసాపురం లో కూడా భారీ ఎత్తున గంజాయి విక్రయిస్తున్నారూ. గంజాయి సేవించేందుకు యువత పెడదారి పడుతున్నట్లు తెలుస్తోంది. రాబడిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుతో ఎప్పటినుంచి ఎక్కడెక్కడ క్రయ విక్రయాలు జరిపారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఆత్మకూరులో గంజాయి లభ్యం వెనుక అంతర్రాష్ట్ర లింకులు ఉన్నట్లు తేలింది. ఒడిస్సా రాష్ట్రం నుంచి ఆత్మకూరుకి ట్రైన్ ద్వారా తరలించి విక్రయిస్తున్నట్లు తేలింది. ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన ఒక యువకుడు పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇంతటితో ఆగలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గంజాయి కరయ్య విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. ఎమ్మిగనూరు మండలం కనకవీరుడు పేట గ్రామంలో కొందరు యువత యదేచ్ఛగా గంజాయి కొని సేవిస్తున్నట్లు తేలింది. పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఐదు కేజీల పైగా గంజాయి సీజ్ చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎమ్మిగనూరు డిఎస్పి భార్గవి చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

నందికొట్కూరులో ఏకంగా డ్రగ్స్ తయారీ డెన్ బయటపడింది. బస్టాండ్ ఎదురుగానే ఓ కమర్షియల్ కాంప్లెక్స్ పై భాగంలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులు గుర్తించారు. ఇందులో కూడా అంతరాష్ట్ర లింకులు ఉన్నట్లు తేలింది. ఉన్నత చదువులు చదివిన యువకులు ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఇద్దరినీ అరెస్టు చేయగా సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. అల్ఫరాజోలం అనే ట్రక్ తయారు చేసి దీనిని కల్లు లో కలిపి విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కల్లు దుకాణాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కళ్ళు సేవించిన వారందరికీ ఏమైనా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించిందా అనే కోణంలో కూడా నార్కోటిక్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే గంజాయి పరిధిలు దాటి విస్తరిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది.

ఇది చదవండి: ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..