AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: వేళ్లు చూపిస్తే సైలెంట్‌గా కూర్చునే టైప్ కాదు.. ఆ వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్

Rohit Sharma on Jaspri Bumrah and Sam Konstas Fight: సిడ్నీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్స్టాంట్స్ మధ్య జరిగిన వాగ్వాదం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ విషయంపై రోహిత్ శర్మ కూడా ఘాటుగా స్పందించాడు. బుమ్రాతోపాటు భారత ఆటగాళ్లకు మద్దతు ఇస్తూ మా అబ్బాయిలు సైలెంట్‌గా కూర్చోలేరు అంటూ తేల్చిపారేశాడు.

Rohit Sharma: వేళ్లు చూపిస్తే సైలెంట్‌గా కూర్చునే టైప్ కాదు.. ఆ వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్
Rohith Sharma
Venkata Chari
|

Updated on: Jan 04, 2025 | 11:57 AM

Share

Rohit Sharma on Jaspri Bumrah and Sam Konstas Fight: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో, చాలా సందర్భాలలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నిసార్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ ముఖాముఖిగా వాగ్వాదానికి దిగగా.. కొన్నిసార్లు విరాట్ కోహ్లీ, సామ్ కాన్స్టాంట్స్ మధ్య వివాదం వార్తల్లోకి వచ్చింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లోనూ ఇదే వాతావరణం నెలకొంది. తొలి రోజు ఆట చివరి ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్‌స్టంట్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పుడు ఈ విషయంపై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. మా అబ్బాయిలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు, రెచ్చగొడితే మాత్రం తిరిగి ఘాటుగా రిప్లే ఇస్తారంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మీరు వేళ్లు చూపిస్తూ.. సైలెంట్ ఎందుకుంటామ్..

సిడ్నీ టెస్టు తొలిరోజు చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్‌ సామ్‌ కాన్‌స్టాంట్స్‌, భారత వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండో రోజు ఆట లంచ్ విరామం తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ రోహిత్ శర్మను ఈ విషయం గురించి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘మా అబ్బాయిలు నిశ్శబ్దంగా ఉన్నంత కాలం నిశ్శబ్దంగానే ఉంటారు. మీరు వేళ్లు చూపిస్తే మౌనంగా ఉండరు. అందుకు గట్టిగానే ఆన్సర్ చేస్తారు’ అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

బుమ్రా-కొంటాస్ వివాదం ఏమిటి?

ఈ మొత్తం ఘటన తొలిరోజు ఆట చివరి రెండు బంతుల్లో ఓ వాగ్వాదం చోటు చేసుకుంది. బుమ్రా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ను, తొలి రోజు ఆటలో చివరి ఓవర్‌ను బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆ ఓవర్‌లోని ఐదో బంతిని వేయడానికి బుమ్రా ముందుకు రాగా, స్ట్రయిక్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా సిద్ధంగా లేడు. మరోసారి బుమ్రా బంతిని వేయడానికి సిద్ధమయ్యేలోపు కొంచెం ఆందోళన చెందాడు. ఇంతలో, నాన్-స్ట్రైక్‌లో నిలబడి ఉన్న సామ్ కాన్స్టాంట్స్ ఎటువంటి కారణం లేకుండా బుమ్రాతో ఏదో అన్నాడు. బుమ్రా కూడా కాన్స్టాస్‌ దగ్గరకు వస్తూ ధీటుగా సమాధానం ఇష్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు ఏదో చెప్పుకోవడం కనిపించింది. అనంతరం అంపైర్ జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు.

ఇవి కూడా చదవండి

వివాదం ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బుమ్రా వేసిన బంతి డాట్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత చివరి బంతికి వచ్చిన బుమ్రా ఖవాజా వికెట్‌ పడగొట్టాడు. బుమ్రా వికెట్ పడగొట్టిన వెంటనే, అతను కోపంగా కాన్‌స్టంట్స్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఆపై ఆగి ఏదో మాట్లాడడం కనిపించింది. దీని తర్వాత భారత ఆటగాళ్లు కూడా వికెట్‌ తీయడంతో సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..