AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో..

శరీర బరువు, BMI కంటే కాళ్ల బలమే మీ దీర్ఘాయువు, ఆరోగ్యం నిజమైన సూచిక అని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్లు దాటాక కాళ్ల కండరాల బలం కీలకమని హార్వర్డ్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సార్కోపెనియాను అరికట్టి, మెదడు ఆరోగ్యానికి ఇది తోడ్పడుతుంది. సరైన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారంతో కాళ్ల బలాన్ని పెంచుకోవచ్చు.

నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో..
Leg Strength And Longevity
Krishna S
|

Updated on: Dec 21, 2025 | 1:14 PM

Share

మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పటివరకు శరీర బరువు, కేలరీలు లేదా బాడీ మాస్ ఇండెక్స్ వంటి పాత పద్ధతులనే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ మీరు ఎంత కాలం జీవిస్తారు? వృద్ధాప్యంలో ఎంత స్వతంత్రంగా ఉంటారు? అనే విషయాలను మీ బరువు కంటే మీ కాళ్ల బలం మాత్రమే ఖచ్చితంగా చెబుతుందని అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ప్రకారం.. 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్ణయించేది వారి గుండె లేదా ఊపిరితిత్తుల కంటే వారి కాళ్ల కండరాలే.

BMI కంటే కాళ్ల బలం ఎందుకు ముఖ్యం?

BMI కేవలం ఎత్తుకు తగ్గ బరువును మాత్రమే లెక్కిస్తుంది. కానీ ఆ బరువులో ఎంత కండరం ఉంది.. ఎంత కొవ్వు ఉందనేది చెప్పదు. పరిశోధనల ప్రకారం.. ఒకే రకమైన BMI ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఎవరికైతే కాళ్ల కండరాలు బలంగా ఉంటాయో, వారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తేలింది.

కాళ్ల బలం తగ్గితే వచ్చే ప్రమాదాలు

30 ఏళ్ల వయస్సు తర్వాత వ్యాయామం చేయని వారు ప్రతి దశాబ్దానికి 3-5శాతం కండరాల బలాన్ని కోల్పోతారు. దీనినే సార్కోపెనియా అంటారు. కాళ్ల బలం తగ్గడం వల్ల వృద్ధాప్యంలో పడిపోవడం, ఎముకలు విరగడం, పక్షవాతం ముప్పు, త్వరగా మరణించే అవకాశం పెరుగుతుంది.

మెదడు ఆరోగ్యానికి.. కాళ్లకు ఉన్న లింక్ ఏంటి?

బలమైన కాళ్లు కేవలం నడవడానికి మాత్రమే కాదు.. మెదడు చురుకుదనానికి కూడా కీలకమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. కాళ్ల కండరాలు బలంగా ఉన్నవారిలో చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మన నాడీ వ్యవస్థ, కండరాల మధ్య ఉండే సమన్వయం మెదడు ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

మీ కాళ్లు బలంగా ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి

సంక్లిష్టమైన వైద్య పరీక్షలు లేకుండానే మీ కాళ్ల బలాన్ని మీరు ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు..

  • ఒక కుర్చీలో కూర్చుని, మీ రెండు చేతులను గుండెకు అడ్డంగా ఉంచుకోండి
  • 30 సెకన్లలో మీరు ఎన్నిసార్లు లేచి కూర్చోగలరో లెక్కించండి.
  • 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 20 నుంచి 25 సార్లు లేచి కూర్చోవాలి.
  • ఈ పరీక్షలో నెమ్మదిగా ఉన్నవారు లేదా తక్కువ సార్లు చేసేవారు భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

కాళ్లను బలోపేతం చేసుకోవడం ఎలా?

వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సులోనైనా వ్యాయామం ద్వారా కాళ్ల బలాన్ని పెంచుకోవచ్చు. దీని కోసం కింద పేర్కొన్న వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు:

స్క్వాట్స్: కుర్చీ సహాయంతో లేదా నేరుగా స్క్వాట్స్ చేయడం.

మెట్లు ఎక్కడం: రోజువారీ పనుల్లో భాగంగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి.

ప్రోటీన్ ఆహారం: కండరాల పెరుగుదల కోసం గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా లేదా పాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.

నిలబడితే కదలలేం.. కూర్చుంటే లేవలేం అనే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుండే మీ కాళ్లపై దృష్టి పెట్టండి. బరువు తగ్గడం కంటే కండరాలు పెంచుకోవడమే అసలైన దీర్ఘాయువు రహస్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..