AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు.. తింటే మీ పని అయిపోయినట్లే..

Chicken: కోడి మాంసం ఆరోగ్యకరమైన ప్రోటీన్ అయినప్పటికీ, దానిలోని కొన్ని భాగాలు తినడం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల, ఊపిరితిత్తులు, చర్మం, పేగులు, పాదాలు వంటి వాటిలో పురుగుమందులు, బ్యాక్టీరియా, అనారోగ్యకరమైన కొవ్వులు, హార్మోన్లు పేరుకుపోతాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. ఆరోగ్యం కోసం ఈ భాగాలను దూరంగా ఉంచడం, మాంసం బాగా ఉడికించడం ముఖ్యం.

చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు.. తింటే మీ పని అయిపోయినట్లే..
Harmful Parts Of Chicken
Krishna S
|

Updated on: Dec 21, 2025 | 11:53 AM

Share

మాంసాహార ప్రియులకు చికెన్ అంటే మస్త్ ఇష్టం. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రోటీన్ పరంగా చికెన్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కోడిలోని ప్రతి భాగం తినడానికి సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని భాగాలను తినడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

చికెన్‌లోని ఏ భాగాలను మనం తినకూడదు?

కోడి తల – మెదడు

కోళ్లకు ఇచ్చే ఆహారంలో ఉండే పురుగుమందులు, రసాయనాలు లేదా ఇతర విషపూరిత మూలకాలు నేరుగా వాటి మెదడులో పేరుకుపోతాయి. తల భాగాన్ని తినడం వల్ల ఆ విషతుల్య రసాయనాలు మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

కోడి ఊపిరితిత్తులు

కోడి ఊపిరితిత్తులు గాలిలోని దుమ్ము, పరాన్నజీవులను వడపోసే స్పాంజ్ లాంటివి. వీటిని ఎంత ఉడికించినా లోపల ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశించదు. వీటిని ఆహారంగా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని ఆహార భద్రతా నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చికెన్ స్కిన్

చికెన్ స్కిన్ చూడటానికి రుచిగా అనిపించినా, అది కేవలం సంతృప్త కొవ్వుతో నిండి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాకుండా చర్మంపై బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువ.

కోడి పేగులు – పాదాలు

పేగులు: పేగుల్లో సహజంగానే వ్యర్థాలు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇంట్లో ఎంత శుభ్రం చేసినా సూక్ష్మజీవులను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. పాదాలు: కోళ్లు నేలపై నడుస్తాయి కాబట్టి వాటి గోళ్లు, చర్మం పగుళ్లలో E.coli వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణమవుతాయి.

కోడి మెడ

మెడ భాగం ఎముకలు, మజ్జలతో నిండి ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం ఎక్కువ. ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే, ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురి చేస్తుంది.

కోడి గుండె

గుండెలో ప్రోటీన్ ఉన్నప్పటికీ, కోడి సజీవంగా ఉన్నప్పుడు విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్లు అందులో పేరుకుపోతాయి. వీటిని తరచుగా తినడం వల్ల మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

ఇతర భాగాలు

గిజార్డ్ : దీనిలో ధూళి, చిన్న రాళ్లు ఉండవచ్చు, కాబట్టి శుభ్రం చేయకుండా తినడం ప్రమాదం.

వింగ్ టిప్స్: రెక్కల చివరన ఉండే ఈ భాగంలో పోషకాలు ఉండవు. కేవలం కొవ్వు, బ్యాక్టీరియా మాత్రమే ఉంటాయి.

ఎముక మజ్జ: సరిగ్గా ఉడకని మజ్జలో ముడి రక్తం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంది.

చికెన్ కొనేటప్పుడు లేదా వండేటప్పుడు పైన పేర్కొన్న భాగాలను తొలగించడం ఉత్తమం. మాంసం ఎప్పుడూ బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలని గుర్తుంచుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్