Telangana: బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు.. కొంగుచాటు జరిగే మ్యాటరే వేరుంది
వెండి పట్టీల బాక్స్ తో ఆ మాయ లేడీలో వెళ్లిన తర్వాత కళ్ళుతెరిచిన వర్కర్ బాక్స్ తగ్గడం చూసి షాక్ అయ్యాడు.. మోసం చేసి వెండి పట్టిల బాక్స్ అపహరించారని గుదొంగతనాన్ని పసిగట్టాడు..వెంటనే వారి కోసం గాలించారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు చూసి షాక్ అయిన షాప్ యజమాని cc ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ములుగు జిల్లాలో ఆరు మాయలేడిలు అచ్చం సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు.. ఓ బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు. సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలు చూసి షాప్ యజమాని షాక్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఇద్దరు మహిళలు బంగారు ఆభరణ కోసం వచ్చి ఖరీదు చేస్తున్నట్లు నటించారు.. ఆ తర్వాత మరో నలుగురు మహిళలు వచ్చి షాపులో వర్కర్‌ను కన్ఫ్యూజ్ చేశారు. వెంటనే వెండి పట్టిలు చూపాలని తొందరపెట్టారు.. అతను పట్టిల ట్రే తీసి చూపిస్తున్న క్రమంలోనే ఆ మాయలడీలు వాళ్ళ పనికానిచ్చేశారు.. ఒక బాక్స్ మొత్తం మాయం చేసి అక్కడి నుంచి ఉడాయించారు.
ఇది చదవండి: ఒళ్లు గగుర్పొడుస్తున్న బాబా వంగా జోస్యం.. వామ్మో.! 2026 అత్యంత భయంకరంగా ఉంటుందా.?
వెండి పట్టీల బాక్స్ తో ఆ మాయ లేడీలో వెళ్లిన తర్వాత కళ్ళుతెరిచిన వర్కర్ బాక్స్ తగ్గడం చూసి షాక్ అయ్యాడు.. మోసం చేసి వెండి పట్టిల బాక్స్ అపహరించారని గుదొంగతనాన్ని పసిగట్టాడు..వెంటనే వారి కోసం గాలించారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు చూసి షాక్ అయిన షాప్ యజమాని cc ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ మాయ లేడిల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ముఠా ఎక్కడికి పోయినా ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారని, గతంలో కూడా ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారని వ్యాపారాలు చెప్తున్నారు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతుంది. వీళ్ళు ఎక్కడి వారు..! ఎందుకు ఏజెన్సీలో తిరుగుతున్నారు..! ఈ ఒక్క షాపులోనే ఇంకా ఏదైనా దొంగతనాలు పాల్పడ్డారా..! అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.. ఆ మాయలేడిల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను కూడా రంగంలోకి దింపారు.
ఇది చదవండి: ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








