AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ ఆఫీసులు అక్కడే..

సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, యూనివర్సిటీల భవనాలకు సంబంధించి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి వాటికి అద్దె చెల్లింపులను రద్దు చేయనున్నారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ ఆఫీసులు అక్కడే..
Telangana Government
Venkatrao Lella
|

Updated on: Dec 21, 2025 | 8:05 AM

Share

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు, యూనివర్సిటీల బిల్డింగ్‌లకు సంబంధించి సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ ఆఫీసులు ఇక నుంచి ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ భవనాల్లో నడపవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అన్ని శాఖలు, యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ఆదేశించారు.

డిసెంబర్ 31లోపు షిఫ్ట్

డిసెంబర్ 31వ తేదీలోపు ప్రైవేట్ భవనాల్లో ఉన్న ఆఫీసులు, యూనివర్సిటీలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా వాటికి ప్రభుత్వ భవనాలను కేటాయించాల్సిందిగా అన్ని శాఖలకు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలు పాటించపోతే శాఖ అధిపతులే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుదంని, అద్దెలు వాళ్లే చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో తెలిపింది. వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ కావాలని ఆదేశించింది.

రేవంత్ మరో నిర్ణయం

అటు రేవంత్ రెడ్డి మరో కీలక డెసిషన్ కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల వ్యవసాయ సహకార పరిమితి సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ డీసీసీబీలను రద్దు చేశారు. వీటి నిర్వహణను తాత్కాలికంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.