క్యూట్ బ్యూటీ రెజీనా కాసాండ్రాకు ఆఫర్స్ ఎందుకు రావడం లేదబ్బా..!

20 December 2025

Pic credit - Instagram

Rajeev 

రెజీనా కాసాండ్రా ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె 1990 డిసెంబరు 13న చెన్నైలో జన్మించింది.

ఆమె తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

రెజీనా 2005లో తమిళ చిత్రం కండా నాల్ ముదల్లో సహాయ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆమెకు 14 ఏళ్ల వయసులోనే ఈ అవకాశం దక్కింది. 2012లో శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

శివ మనసులో శృతి చిత్రం ఆమెకు SIIMA అవార్డ్ (ఉత్తమ తొలి నటి) తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.