టేస్టీ టేస్టీగా రొయ్యల మిరియాలు వేపుడు.. మీ కిచెన్లోనే ఈజీగా..
Prudvi Battula
Images: Pinterest
21 December 2025
రొయ్యలలో మంచి కొవ్వులు, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక అభివృద్ధికి మంచివి. ఇవి చికెన్ కంటే రుచిగా ఉండాయి.
రొయ్యలు
రొయ్యలలో మిరియాలు వేసి ఫ్రై చేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. ఎక్కువగా కష్టపడకుండా దీన్ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.
రొయ్యల మిరియాలు వేపుడు
రొయ్యల మిరియాలు వేపుడు కోసం కావలసినవి రొయ్యలు, వెల్లుల్లి, లవంగాలు, పచ్చిమిర్చి, మిరియాలు, కరివేపాకు, జీలకర్ర పొడి, పసుపు పొడి, కొబ్బరి నూనె, ఉప్పు.
కావలసినవి
ముందుగా రొయ్యలు బాగా కడుక్కోవాలి. శుభ్రం చేసిన రొయ్యలను జీలకర్ర పొడి, పసుపు కలిపి అరగంట నానబెట్టండి.
రొయ్యలు
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి.
బాగా వేయించండి
తర్వాత అందులో నానబెట్టిన రొయ్యలను వేసి, అవసరమైనంత ఉప్పు వేసి కొంతసేపు బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి.
రొయ్యలను వేసి ఉడికించాలి
మీరు వేసిన రొయ్యలలో ఇప్పటికే నీరు ఉన్నందున మళ్ళీ నీరు జోడించాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్ సరిపోతుంది.
మళ్ళీ నీరు అవసరం లేదు
రొయ్యలు బాగా ఉడికిన తర్వాత, దానిపై చిటికెడు కారం పొడి చల్లి, బాగా కలిపి, రెండు నిమిషాలు ఉడికించాలి. అంతే రెసిపీ రెడీ.
రెసిపీ రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
7 రోజులు.. 7 రంగులు.. నైల్ పోలిష్ వేసుకుంటే.. మీరు అదృష్టానికి పేటెంట్ పొందినట్టే..
వింటర్ టూర్‌పై నో టెన్షన్.. కర్ణాటక మీ కోసం అటెన్షన్..
చికెన్ లెగ్ ఫ్రై ఇలా చేసుకున్నారంటే.. ఆ టేస్ట్ వేరే లెవెల్..