AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత.. అసలు ఎలా సెలక్ట్ చేస్తారంటే..?

Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపడం అత్యంత నైపుణ్యం, అనుభవం అవసరం. అసిస్టెంట్ లోకో పైలట్‌గా కెరీర్ ప్రారంభించి, క్రమంగా అనుభవంతో వందే భారత్ పైలట్‌గా మారవచ్చు. వీరి బాధ్యతలు రైలు నియంత్రణతో పాటు సాంకేతిక పర్యవేక్షణ కూడా. వారికి ఆకర్షణీయమైన జీతాలు, అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. వారి జీతం ఎంత ఉంటుందంటే..?

వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత.. అసలు ఎలా సెలక్ట్ చేస్తారంటే..?
Vande Bharat Loco Pilot Salary
Krishna S
|

Updated on: Dec 21, 2025 | 8:18 AM

Share

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను నడపడం సాధారణ విషయం కాదు. అత్యంత నైపుణ్యం, ఏకాగ్రత, అనుభవం ఉన్న పైలట్లకు మాత్రమే రైల్వే శాఖ ఈ బాధ్యతలను అప్పగిస్తుంది. అసలు వందే భారత్ పైలట్ జీతం ఎంత? వారిని ఎలా ఎంపిక చేస్తారు..? అనేది తెలుసుకుందాం..

కెరీర్ ప్రారంభం ఇలా..

ఒక వ్యక్తి నేరుగా వందే భారత్ రైలుకు పైలట్ కాలేరు. దీనికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది:

అసిస్టెంట్ లోకో పైలట్: కెరీర్ ఇక్కడే మొదలవుతుంది. వీరు సీనియర్ పైలట్లకు సహాయకులుగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

లోకో పైలట్ (షంటింగ్/ఫ్రైట్): యార్డులలో రైళ్లను సర్దుబాటు చేయడం, ఆపై సరుకు రవాణా రైళ్లను నడపడం ద్వారా అనుభవం గడిస్తారు.

ప్యాసింజర్ – ఎక్స్‌ప్రెస్: సుదీర్ఘ అనుభవం తర్వాత ప్యాసింజర్ రైళ్లు, ఆపై వందే భారత్ వంటి ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపే అవకాశం వస్తుంది.

చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్: ఇది అత్యున్నత స్థాయి. వీరు రైలు కార్యకలాపాలను, శిక్షణను పర్యవేక్షిస్తారు.

వందే భారత్ పైలట్ల బాధ్యతలు

ఈ పైలట్ల బాధ్యతలు కేవలం రైలును స్టార్ట్ చేయడం మాత్రమే కాదు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు.

  • ఆధునిక లోకోమోటివ్, కంప్యూటరైజ్డ్ ఇంజిన్ సిస్టమ్‌లను పర్యవేక్షించడం.
  • రైలు వేగాన్ని నియంత్రించడం, బ్రేకింగ్ సిస్టమ్‌పై పూర్తి పట్టు సాధించడం.
  • స్టేషన్ సిబ్బంది, కంట్రోల్ రూమ్‌తో నిరంతరం కమ్యూనికేషన్‌లో ఉండటం.
  • ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే తక్షణమే స్పందించి సేఫ్టీ నిర్ణయాలు తీసుకోవడం.

జీతభత్యాలు

7వ పే కమిషన్ ప్రకారం లోకో పైలట్లకు మంచి జీతాలు ఉంటాయి.

కొత్త ALP: ప్రారంభంలో బేసిక్ శాలరీ రూ. 19,900 ఉండగా, అలవెన్సులన్నీ కలిపి రూ. 44,000 నుండి రూ. 51,000 వరకు అందుకోవచ్చు.

వందే భారత్ పైలట్: ఈ ప్రీమియం రైలును నడిపే సీనియర్ పైలట్ల ప్రాథమిక వేతనం రూ. 65,000 నుండి రూ. 85,000 వరకు ఉంటుంది.

సీనియర్ మోస్ట్ పైలట్లు: 30 ఏళ్ల అనుభవం ఉన్నవారు లేదా చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ (CLI) స్థాయి అధికారులు అన్ని అలవెన్సులు కలిపి నెలకు రూ. 2,00,000 నుండి రూ. 2,50,000 వరకు సంపాదిస్తున్నారు.

అదనపు ప్రయోజనాలు

జీతంతో పాటు వీరికి టీఏ, డీఏ, హౌస్ రెంట్, రాత్రిపూట విధులు నిర్వర్తించే వారికి నైట్ డ్యూటీ అలవెన్సులు అదనంగా లభిస్తాయి. వీటన్నింటికీ మించి వందే భారత్ వంటి ప్రతిష్టాత్మక రైలును నడపడం వారికి ఒక గొప్ప గౌరవం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి