Job Calender: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతీ ఏడాది ముందే జాబ్ క్యాలెండర్..
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది. ప్రతీ ఏడాది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయల్సిందేనని తెలిపింది. ముందుగానే పరీక్ష తేదీలను నిర్ణయించాలని సూచించారు. పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలాగే పరీక్షలు ఏయే తేదీల్లో నిర్వహిస్తామనేది ముందుగానే ఈ క్యాలెండర్ ద్వారా వెల్లడిస్తామని, దానికి తగ్గట్లు అభ్యర్ధులు సిద్దం కావచ్చని తెలిపారు. ప్రతీ ఏడాది తప్పనిసరిగా జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. పారదర్శకత ఉండేలా అన్నీ ముందే సిద్దం చేస్తామని, ఆ తేదీల ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ జాబ్ క్యాలెండర్‌కు కట్టుబడి ఉండాలని భట్టి సూచించారు.
జాబ్ నోటిఫికేషన్లలో ఆలస్యం వల్ల నిరుద్యోగులు నిరాశ చెందే అవకాశం ఉంటుందని, అదే ముందే జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల వారికి లాభం జరుగుతుందని భట్టి విక్రమార్క అన్నారు. జాబ్ క్యాలెండర్‌కు తగ్గట్లు అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతారని, అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారని అన్నారు. క్వశ్చన్ పేపర్ నుంచి అభ్యర్థుల తుది ఎంపిక వరకు అత్యంత పారదర్శకతతో వ్యవహరిస్తామని తెలిపారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. టెక్నాలజీ ఉపయోగించుకుని రియల్ టైమ్ సమాచారం అభ్యర్థులకు అందించాలని భట్టి సూచించారు.
పేపర్ లీకేజీలను అడ్డుకునేందుకు అత్యాధునిక భద్రతా వ్యవస్థలను ఉపయోగించుకోవాల్సిందిగా భట్టి సూచించారు. ఇక రిజర్వేషన్ల అమలులో కమిషన్లదే కీలక పాత్ర అని, న్యాయపరమైన చిక్కులను అధిగమించి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పనిచేయాలని, వారు ఎంపిక చేసే అధికారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. పారదర్శకంగా నియామకాలు జరిగే చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.




