పైనాపిల్ జ్యూస్‌ అతిగా తాగుతున్నారా.? అనారోగ్యాన్ని వెంట పెట్టుకున్నట్టే..

Prudvi Battula 

Images: Pinterest

21 December 2025

పైనాపిల్ అధిక ఆమ్లత్వం. బ్రోమెలైన్ ఎంజైమ్ కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు లేదా గుండెల్లో మంటకు కారణం. అందుకే దీనితో చేసిన జ్యూస్ ఎక్కువగా తీసుకోవద్దు.

జీర్ణవ్యవస్థలో అసౌకర్యం

పైనాపిల్ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల దురద, వాపు, దద్దుర్లు లేదా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఇది మోతాదులో తాగడం మంచిది.

అలెర్జీ ప్రతిచర్యలు

ఇందులో అధిక సహజ చక్కెర కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆందోళన కలిగిస్తుంది.

బ్లడ్ షుగర్ స్పైక్

పైనాపిల్ రసంలో ఉన్న  సిట్రిక్, ఆస్కార్బిక్ ఆమ్లాలు కాలక్రమేణా పంటి ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. దీనివల్ల దంత కోత ఏర్పడుతుంది.

దంత కోత

దీనిలో అధిక పొటాషియం, ఆమ్లత్వం కారణంగా అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయని అంటున్నారు నిపుణులు.

కిడ్నీ సమస్యలు

పైన్ ఆపిల్ జ్యూస్ బ్రోమెలైన్ అనే దానికి మూలం. ఇది సున్నితమైన వ్యక్తులలో చర్మపు దద్దుర్లు లేదా చికాకును కలిగిస్తుంది.

చర్మ సమస్యలు

పైనాపిల్ రసంలోని ఆమ్లత్వం  నోటి పుండ్లకు కారణం అవుతుంది. లేదా క్యాన్సర్ పుండ్లను ప్రేరేపిస్తుంది. తక్కువ తాగడం మంచిది.

నోటి పూతల

ఇందులో బ్రోమెలైన్ రక్తాన్ని పలుచబరిచే లక్షణం కలిగి ఉంది. మందులు లేదా యాంటీబయాటిక్స్‌ వేసుకొంటే పైనాపిల్ జ్యూస్ తాగే ముందు  వైద్యుడిని సంప్రదించండి.

మందులతో సంకర్షణలు