AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు

12 ఏళ్లకు మించి బతకడన్నారు… కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు

Phani CH
|

Updated on: Dec 21, 2025 | 1:09 PM

Share

కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 వేలంలో రూ. 25.20 కోట్లతో రికార్డు సృష్టించాడు. పుట్టుకతోనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా, వైద్యుల అంచనాలను తలదన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. కఠినమైన ఆహార నియమాలు, పట్టుదలతో తన ఆరోగ్య సమస్యలను అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది.

ఐపీఎల్ 2026 మినీ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు కామెరూన్ గ్రీన్. అబుదాబిలో జరిగిన వేలంలో ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా అతను సరికొత్త రికార్డును లిఖించాడు. ఈ కోట్ల రూపాయల రికార్డ్ వెనుక గ్రీన్ పడ్డ కష్టం,అతను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కామెరూన్ కు పుట్టుకతోనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాజు. తల్లి గర్భంలో ఉండగానే 19 వారాల వయసులో స్కానింగ్‌లో ఈ సమస్య బయటపడింది. గ్రీన్ కిడ్నీలు కేవలం 60 శాతం మాత్రమే పనిచేస్తాయి. ప్రస్తుతానికి అతను ఈ వ్యాధిలో ‘స్టేజ్-2’లో ఉన్నాడు. గ్రీన్ పుట్టిన సమయంలో వైద్యులు అతని తల్లిదండ్రులకు ఒక భయంకరమైన మాట చెప్పారు. అతను 12 ఏళ్లకు మించి బతకడం కష్టం అని అంచనా వేశారు. కానీ, గ్రీన్ అసాధారణమైన పట్టుదలతో ఆ అంచనాలను తలకిందులు చేశాడు. కఠినమైన ఆహార నియమాలు, తక్కువ ప్రోటీన్, ఉప్పుతో కూడిన డైట్‌ను పాటిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కేకేఆర్ రూ.25.20 కోట్లకు అతన్ని దక్కించుకుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వ్యక్తికి కండరాల తిమ్మిర్లు రావడం సహజం. గ్రీన్ తన కెరీర్‌లో అనేకసార్లు ఈ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. “శారీరక వైకల్యం లేదా అనారోగ్యం కలలకు అడ్డంకి కాకూడదని కామెరూన్ గ్రీన్ నిరూపించాడు. 12 ఏళ్లకే ప్రాణాలు పోతాయన్న చోట.. నేడు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఎదగడం అతని విజయానికి నిదర్శనం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో…! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు