AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026: హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్..వైస్ కెప్టెన్‌నే వెళ్లగొట్టిన సెలెక్టర్లు..టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు

T20 World Cup 2026: బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా శనివారం మధ్యాహ్నం టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ సెలక్షన్లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది.

T20 World Cup 2026: హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్..వైస్ కెప్టెన్‌నే వెళ్లగొట్టిన సెలెక్టర్లు..టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
T20 World Cup 2026 India Squad Selection
Rakesh
|

Updated on: Dec 20, 2025 | 3:55 PM

Share

T20 World Cup 2026: బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా శనివారం మధ్యాహ్నం టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ సెలక్షన్లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారాయి. అవి ఏంటంటే

1. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు

ఈ సెలెక్షన్ లో అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం శుభ్‌మన్ గిల్ తొలగింపు. గత కొన్ని సిరీస్‌లుగా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ను ఈసారి ప్రపంచకప్ జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. టీ20 ఫార్మాట్‌లో అతను వరుసగా ఫెయిల్ అవుతుండటం, నెమ్మదిగా ఆడటం వల్లే సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి కూడా జట్టులో చోటు కోల్పోవడం గిల్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

2. అక్షర్ పటేల్‌కు ప్రమోషన్

గిల్ జట్టు నుంచి తప్పుకోవడంతో, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను మళ్ళీ వైస్ కెప్టెన్ పదవి వరించింది. గతంలోనూ ఈ బాధ్యతలు నిర్వహించిన అక్షర్, జట్టులో సీనియర్ ప్లేయర్‌గా ఎదిగాడు. దక్షిణాఫ్రికా సిరీస్ చివర్లో అనారోగ్యం వల్ల అతను దూరమైనప్పటికీ, ప్రపంచకప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తాడని బీసీసీఐ నమ్మకం వ్యక్తం చేసింది.

3. ఇషాన్ కిషన్ మాస్ రీ-ఎంట్రీ

చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులోకి దూసుకొచ్చాడు. గత ఆసియా కప్‌లో ఆడిన జితేశ్ శర్మను పక్కన పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వికెట్ కీపర్ అయిన ఇషాన్‌కు సెలెక్టర్లు ఓటేశారు. టాప్ ఆర్డర్‌లో ఇషాన్ ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టుకు అవసరమని సెలెక్టర్లు భావించారు.

4. దమ్మున్న ఫినిషర్ రింకూ సింగ్ బ్యాక్

దక్షిణాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కక నిరాశ చెందిన రింకూ సింగ్ అభిమానులకు ఇది తీపి కబురు. మ్యాచ్‌లను ఫినిష్ చేయడంలో దిట్ట అయిన రింకూను ప్రపంచకప్ ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. జితేశ్ శర్మ స్థానంలో ఒక పక్కా ఫినిషర్ కావాలని భావించిన మేనేజ్‌మెంట్, రింకూ సింగ్ వైపే మొగ్గు చూపింది. మిడిల్ ఆర్డర్‌లో రింకూ పవర్ హిట్టింగ్ టీమిండియాకు కొండంత బలం.

5. టీమ్ కాంబినేషన్ కోసం జితేశ్ శర్మ అవుట్

జట్టు కూర్పు సరిగ్గా ఉండాలనే కారణంతో జితేశ్ శర్మను తప్పించారు. ప్రస్తుతం టీమిండియాలో మొదటి వికెట్ కీపర్‌గా సంజూ శామ్సన్ ఉన్నాడు. ఒకవేళ సంజూకి గాయమైనా లేదా ఫామ్ కోల్పోయినా.. అతని స్థానంలో ఓపెనింగ్ చేస్తూ కీపింగ్ చేయగలిగే ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు ప్లాన్ చేశారు. జితేశ్ మిడిల్ ఆర్డర్ కీపర్ కావడంతో, జట్టు బ్యాలెన్స్ కోసం అతనిపై వేటు వేయాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..