Chittoor: కొండ కింద కాయ్ రాజా కాయ్! పేరుకే లాటరీ.. కానీ లోపల యవ్వారం మాత్రం వేరుంటుంది
చిత్తూరు... అటు తమిళనాడు ఇటు కర్ణాటకకు బోర్డర్ సిటీ. ఇక్కడ తమిళ కల్చరే కాదు తమిళ భాషా ప్రభావం కూడా ఎక్కువే. కానీ, కొత్తగా ఇక్కడ కేరళ కల్చర్ కూడా మొదలైంది. ఔను, కేరళలో మాత్రమే చట్టబద్ధమైన ఆన్‌లైన్ లాటరీ వ్యాపారానికి చిత్తూరు జిల్లా అక్రమ అడ్డాగా మారింది.

ఆన్‌లైన్ లాటరీ బిజినెస్.. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అఫీషియల్. ఏపీలో మాత్రం నిషేధం. కానీ, చిత్తూరు జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది లాటరీ వ్యాపారం. లాటరీ టికెట్ల అమ్మకంతో ప్రతీరోజూ లక్షల్లో వెనకేసుకుంటున్నారు మోసగాళ్లు. ఆన్ లైన్లో కేరళ లాటరీ టికెట్లు డౌన్లోడ్ చేసి, నెంబర్లను తెల్ల కాగితంపై రాసి, విచ్చలవిడిగా అమ్మెయ్యడం.. ఇదీ యవ్వారం. రెండుముఠాలుగా విడిపోయి, కొన్ని కార్నర్స్‌ని క్యాప్చర్ చేసి.. చిల్లర దుకాణాల్లో కేరళ లాటరీ టికెట్లను అమ్మేస్తున్నారు. చిత్తూరు ఓల్డ్ బస్టాండ్, దర్గా సర్కిల్, గిరింపేట, మార్కెట్ ఏరియా, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, కొంగారెడ్డిపల్లి.. ఇవీ అడ్డాలు. చిన్న వ్యాపారులు, రోజుకూలీలు, చిరుద్యోగులే వీళ్ల టార్గెట్లు. గత ఏడాదిలో ఆగస్టులో లాటరీ టిక్కెట్లు అమ్ముతున్న ప్రకాష్, సురేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఐనా కేరళ లాటరీ టిక్కెట్ల దందా ఆగలేదు. లేటెస్ట్‌గా మూడు రోజులుగా పోలీసులు దాడులు చేసి, లాటరీ టికెట్లు అమ్ముతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడితోనే ఆగలేదు. ఈ ముఠాల మూలాలు ఎక్కడ అని ఆరా తీస్తున్నారు.
ఇది చదవండి: ఒళ్లు గగుర్పొడుస్తున్న బాబా వంగా జోస్యం.. వామ్మో.! 2026 అత్యంత భయంకరంగా ఉంటుందా.?
అటు, చిత్తూరులో కొనసాగుతున్న లాటరీ టికెట్ల ఇల్లీగల్ బిజినెస్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫైటింగ్ జరుగుతోంది. ఒక ముఠాపైనే ఫోకస్ పెట్టి, మరో ముఠాను ఎంకరేజ్ చేస్తున్నారని పోలీసుల తీరును విమర్శిస్తున్నారు నెటిజన్లు. అటు, పొలిటికల్ పార్టీ పెద్దలకు తెలిసే లాటరీ టికెట్ల దందా కొనసాగుతోందన్న ఎలిగేషన్లూ ఉన్నాయి. ఇటు, కలెక్టర్లను కలిసి, వినతిపత్రాలు సమర్పించడంతో చిత్తూరు జిల్లా లాటరీ లూటీపై పొలిటికల్ హీట్ పెరిగింది. చిత్తూరుకు చెందిన ముఠాలు చిత్తూరుతోనే ఆగడం లేదు. వీళ్ల ఆన్ లైన్ లాటరీ టికెట్ల నెట్‌వర్క్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇటీవలే చిత్తూరుకు చెందిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. మరి, మన ఖాకీ శాఖ లైట్ తీసుకుంటుందా? లాటరీ లూటీ అంతు చూస్తుందా?
ఇది చదవండి: ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు..








