AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఎక్కడంటే..

నల్లగా ఉన్న ఓ చిరుత తన నోటితో ఓ పులి కూనని పట్టుకొని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిరుతపులి నల్లగా, భయానకంగా ఉండగా చిరుత నోట్లో ఉన్న కూన మాత్రం సాధారణ చిరుత మాదిరిగానే ఉంది. దీనిపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చారు..

Viral Video: బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఎక్కడంటే..
Black Leopard
Gamidi Koteswara Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jan 04, 2025 | 11:59 AM

Share

నల్లగా ఉన్న ఓ చిరుత తన నోటితో ఓ పులి కూనని పట్టుకొని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిరుతపులి నల్లగా, భయానకంగా ఉండగా చిరుత నోట్లో ఉన్న కూన మాత్రం సాధారణ చిరుత మాదిరిగానే ఉంది. నల్లజాతి చిరుత వేరొక జాతి పులికూనను నోటితో పట్టుకొని ఎక్కడికో వెళ్తుంది.. పాపం ఆ పులికూనను ఈ నల్లజాతి చిరుత ఏమిచేస్తుందో.. ఏమో..? అసలు ఎందుకు తీసుకెళ్తుంది..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. అసలు ఈ వీడియో.. లేదా ఫోటో ఎక్కడ తీసింది? ఏ ప్రాంతంలో జరిగిందని అందరికీ అయోమయంగా మారింది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ పై ఒడిశా నయాఘడ్ జిల్లా అటవీశాఖ అధికారులు స్పందించారు.

ఒడిశాలోని నయాగడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను గుర్తించినట్లు చెప్పారు. ఒక నల్లని చిరుతపులి పులి కూనను నోట కరుచుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ అటవీ శాఖ అధికారుల ట్రాప్ కెమెరాలకు చిక్కింది. అడవిలో సంచరిస్తున్న జంతువుల జాతుల వివరాలు, వాటి సంతతి, ఆరోగ్య పరిస్థితులు, జంతువుల బాగోగులను చూసేందుకు అధికారులు అడవిలో పలు చోట్ల సీక్రెట్ గా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసిన కెమెరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. అలా ఎప్పటిలాగే కెమెరాలు పరిశీలిస్తుండగా ఒక నల్ల చిరుత కెమెరాలో కనిపించింది. దీంతో ఆ నల్ల చిరుత పై ప్రత్యేక దృష్టి సారించి ఆరా తీయడం మొదలుపెట్టారు అధికారులు..

వీడియో చూడండి..

దీంతో నల్ల చిరుత గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ చిరుతపులి మెలనిజం అనే జన్యు లోపం కారణంగా నల్లగా మారిందని, ఇది ప్రత్యేకమైన జాతి కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు. ఈ జన్యులోపంతో ఉన్న జంతువులు ఒడిశాలోని మూడు అటవీ డివిజన్లలో ఉన్నాయని నిర్ధారించారు. ఇవి జన్యులోపంతో ఉన్నప్పటికీ వీటికి పుట్టే పులికూనలు మాత్రం సాధారణంగానే ఉంటాయని తెలిపారు.

ప్రస్తుతం ఈ చిరుత పులి.. తనకు పుట్టిన ఈ కూనను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మార్చే సమయంలో ట్రాప్ కెమెరాలకు చిక్కిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తరుచుగా కనిపించే ఈ నల్లని పులుల ఫోటోలను, వీడియోలను అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటవీశాఖ అధికారులు పోస్ట్ చేసిన ఆ ఫోటోలు, వీడియోలే ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..