అలా చేస్తే మీ భార్య పారిపోతుంది.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై అదానీ కామెంట్లు
అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దనీ అన్నారు.
కొందరు నాలుగు గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బ్యాలెన్స్ అనీ అన్నారు. పనిలోనే నిమగ్నమైపోతే.. భార్యాపిల్లలు పారిపోతారు. మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం. పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి, ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది, అని అదానీ అన్నారు. గతంలో ఓ పాడ్‌కాస్ట్‌లో ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి ఏం చెప్పారంటే.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలాగే పనిచేయాలని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ !! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడుగా..!
Daaku Maharaaj: డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్.. ముందెన్నడూ చూడని విధంగా
గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..