- Telugu News Photo Gallery Donating old clothes? Remember these things, Check Here is Details in Telugu
Vastu Tips: పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
సాధారణంగా ప్రస్తుత కాలంలో బట్టలను ఎక్కువగా కొంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సార్లు వేయకపోయినా.. పాతవి పాతబడి పోతాయి. ఇలాంటి పడేయడం లేదా ఇతరులకు దానం చేయడం వంటివి చేస్తారు. కానీ పాత బట్టలు దానం చేసే విషయంలో ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి..
Updated on: Jan 04, 2025 | 12:47 PM

ఈ జనరేషన్‌లో సందర్భం ఏదైనా సరే కొత్త బట్టలు కొనాల్సిందే. ఒకప్పుడు కేవలం పండుగలు, పుట్టిన రోజులకు మాత్రమే కొత్త బట్టలు కొనేవారు. కానీ ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండటమే లేట్. కుప్పలు తెప్పలుగా బట్టలు కొనేస్తున్నారు. దీంతో పాత బట్టలు ఎక్కువైపోతున్నాయి. దీంతో పనికి రాని బట్టలను పారేస్తూ ఉంటారు.

కానీ బట్టలు పడేసే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటించాలి. మరి కొంత మంది పాత బట్టలను దానం కూడా చేస్తూ ఉంటారు. పాత బట్టలు దానం చేసే విషయంలో కూడా కొన్నింటిని గుర్తు పెట్టుకోవాలి.

ఏవి పడితే అవి దానం చేయకూడదు. కాస్త మంచిగా ఉన్న బట్టలు.. ఎదుటి వాళ్లకు ఉపయోగ పడేవి మాత్రమే దానం చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు వాడేసిన బట్టలు దానం చేయకుండా ఉంటే మంచిది.

ఎందుకంటే అప్పటి వరకూ సదరు వ్యక్తి ధరించిన బట్టలకు కూడా వ్యక్తి భావోద్వేగాలు, అనుభవాలు, శక్తి వంటివి కూడా ఎదుటి వ్యక్తి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానం చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. గురు వారం రోజు బట్టలు దానం చేయకూడదు.

మీరు బట్టలు దానం చేసిన వ్యక్తి నుంచి కనీసం రూపాయి అయినా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు దానం చేసేందుకు ట్రై చేయండి. చలి కాలం, వర్షా కాలంలో రగ్గులు, స్వెటర్లు, దుప్పట్లు వంటివి దానం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)





























