Watch: ఓరీ దేవుడో ఇదేం వింత కాఫీరా సామీ..! రుచి గురించి వింటే షాక్ తింటారు
ఆహార ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ అనేకం వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో మ్యాగీ మిల్క్ షేక్, old monk గులాబ్ జామ్, బట్టర్ చికెన్ గోల్‌గప్పా, ఓరియో పకోడీ, చాక్లెట్ మసాలా స్వీట్ కార్న్, డ్రై ఫ్రూట్ చీజ్ దోస వంటివి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. అలాగే, ఓసారి మ్యాగీ లడ్డు కూడా ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేసింది. మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వాలని ఓ వ్యక్తి తయారు చేసిన కాఫీ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. వీడియో చూసిన కాఫీ ప్రియుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఆహారంతో అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది. ఏ విధంగానైనా తమ వంటకాన్ని మరింత రుచికరమైనదిగా చేయడమే టార్గెట్. అటువంటి వాళ్లలోనే కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చాలా ఫేమస్ అయిపోయారు. మరి అలాంటివి కొన్ని ఫన్నీ వంటకాలు మనల్ని ఆశ్చర్య పరిచేవిగా ఉంటాయి. కొన్ని వీడియోలు చేసిన తరువాత మనలో కోపం అసలు కంట్రోల్ చేసుకోవాలనిపించదు. వాళ్లు దొరికితే, శిక్షించాలని కూడా అనిపిస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక వ్యక్తి మొక్కజొన్న కాఫీని తయారు చేశాడు. ఇది చూసి కాఫీ ప్రియుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కప్పు కాఫీ కడుపులో పడకుండా నిద్రపోని వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది దీనితో అనేక రకాల ప్రయోగాలు చేయడానికి కారణం ఇదే. అయితే, కొన్ని ప్రయోగాలు దాని రుచిని పూర్తిగా పాడు చేస్తాయి. ఇక్కడో వ్యక్తి కాఫీతో ఇలాంటి ఫుడ్ ఫ్యూజన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను మీరే చూడండి.
వైరల్ వీడియోలో ఓ వ్యక్తి కాఫీ పట్టుకుని కూర్చున్న దృశ్యం వీడియోలో చూడవచ్చు. ఆ తరువాత అతను తన కాఫీలో మీగడ మొక్కజొన్న వేసి కలిపాడు. ఇది చూసేందుకు వింతగా అనిపించినప్పటికీ అతడు దాన్ని నెమ్మదిగా తాగుతాడు. చూస్తుంటే కాఫీ బాగానే చేసినట్టు అనిపించినా చూసేవాళ్ళకి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
తరచూ ఇలాంటి ప్రయోగాలు చేసే కెల్విన్ లీ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేయగా, లక్షల మంది ఈ వీడియోను చూసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దీనిపై ఒకరు స్పందిస్తూ..బ్రదర్ ఈ కాఫీని ఎవరు ట్రై చేయాలనుకుంటారు.. మరొకరు ఇలా రాసారు.. మీకు ఇలాంటి కాఫీ ఇష్టమైతే తాగండి..అంతేకానీ, మీరు ఇతరులకు ఎందుకు కోపం తెప్పిస్తున్నారు? అంటూ రాశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై మండిపడుతూ, కోపంగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..