ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?
Cumin Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2025 | 10:44 AM

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీలకర్రలో పాలీఫెనాల్స్, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర నీరు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రస్తుత రోజుల్లో చాలా మంది జీలకర్ర నీటిని తాగటం అలవాటుగా చేసుకున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..?

జీలకర్రలోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. జీలకర్ర టైప్ 2 డయాబెటిస్‌లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడతాయి. జీలకర్రలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తాయి. జీలకర్ర నీళ్లలో కేలరీలు తక్కువ. ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల నిర్జలీకరణను నివారించవచ్చు. రాత్రి తాగితే దాహం తీరుతుంది.

జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. మరే ఇతర జంక్ ఫుడ్ తినకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..