AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో ముల్తానీ మిట్టిని ఇలా వాడితే.. మీ ముఖం అందంలా మెరుస్తుంది.!

అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, అందం పెంచడానికి అద్భుతమైన సౌందర్య సాధనం ముల్తాని మట్టి అంటున్నారు నిపుణులు. మీ చర్మాన్ని కాపాడుకోవడానికి, చర్మం రంగు పెరగడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ముల్తాని మట్టిలో చర్మ సమస్యలకు సంబంధించిన లక్షణాలు చాలా ఉన్నాయి.

చలికాలంలో ముల్తానీ మిట్టిని ఇలా వాడితే.. మీ ముఖం అందంలా మెరుస్తుంది.!
Multani Mitti For Glowing Skin
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2025 | 8:39 PM

Share

చలికాలంలో చర్మాన్ని సంరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో అనేక రకాలైన చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. వింటర్ సీజన్‌లో పొడిగాలి చర్మంలోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుంది. చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. చర్మం పొడిగా, దురదగా, ఎర్రగా మారుతుంది. కాబట్టి చలికాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే, చలికాలంలో ముల్తానీ మిట్టిని ఉపయోగించటం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తాని మిట్టి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉన్నందున మొటిమలు, మచ్చలు, టానింగ్ మొదలైన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో మీ ముఖాన్ని మెరిసేలా చేసే ముల్తానీ మిట్టిని అప్లై చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ముల్తానీ మిట్టి, తేనెను ఉపయోగించవచ్చు. దీని కోసం ముల్తానీ మిట్టి, తేనెను బాగా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసిన 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ రెసిపీని వారానికి రెండుసార్లు ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది.

మరో పద్ధతిలో ముల్తానీ మిట్టిని పాలలో కలిపి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం కూడా మెరుగుపడుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి..

ఇవి కూడా చదవండి

ముల్తానీ మిట్టిలో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు, ముఖంపై గీతలు, చారలు వంటివి తగ్గుతాయి. ముఖం కూడా కొత్త తేజస్సు వస్తుంది. అలాగే, చలికాలంలో వారానికి ఒకటి లేదా రెండుసార్లు సున్నితమైన హైడ్రేటింగ్ మాస్క్‌ను అప్లై చేసకోండి. దీని వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్