AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: అయ్యబాబోయ్… పాలు ఎక్కువగా తాగితే.. ఇన్ని సమస్యలా..?

పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్‌ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు పాలు తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ఆరోగ్యాంగా, దృఢంగా ఉండేందుకు పాలు మేలు చేస్తాయి. కానీ, పాలు ఎక్కువగా తాగటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. మోతాదుకు మించి పాలు తాగటం వల్ల కలిగే నష్టలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Health Care: అయ్యబాబోయ్... పాలు ఎక్కువగా తాగితే.. ఇన్ని సమస్యలా..?
Milk
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2025 | 7:34 PM

Share

మంచి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన సంపూర్ణ ఆహారంలో పాలు అతి ముఖ్యం.. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పుష్కలమైన పోషక విలువలు నిండివున్న పాలు ప్రతి రోజూ తప్పక తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్‌ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు పాలు తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ఆరోగ్యాంగా, దృఢంగా ఉండేందుకు పాలు మేలు చేస్తాయి. కానీ, పాలు ఎక్కువగా తాగటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. మోతాదుకు మించి పాలు తాగటం వల్ల కలిగే నష్టలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పాలు ఎక్కువగా తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, అతిసారం వంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే, మీ శరీరం పాలకు అనుగుణంగా లేకుంటే, మీరు దీని కారణంగా పేగు సిండ్రోమ్‌కు గురవుతారు. దీని కారణంగా, మీరు అన్ని ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటారు. ఎక్కువగా తలనొప్పి సమస్య కూడా వేధించే అవకాశం ఉంది.

అంతేకాదు.. పాలు ఎక్కువగా తాగటం వల్ల ముఖంపై మొటిమల సమస్యతో బాధపడాల్సి ఉంటుంది.. ముఖంపై మొటిమలు, మచ్చలు తరచూ వేధిస్తున్నట్టయితే.. మీరు రోజుకు ఎన్ని పాలు తాగుతున్నారో గమనించండి. అలాగే, పాలలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. పాలను నివారించాలి.. లేదా చాలా తక్కువగా తీసుకోవాలి. పాలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తాయి. మీకు రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం