అవిసె నూనె ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? చర్మం, జుట్టు సంరక్షణకు బెస్ట్ రెమిడీ..!

అవిసెలు.. వీటినే ఫ్లాక్‌సీడ్స్‌ అని కూడా అంటారు.. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, పీచు ఎక్కువ. కాబట్టే మధుమేహం, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించటంలో అవిసెలు సమర్థమైనవిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవిసె గింజల పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. అవిసె గింజల నూనె అనేక ఆరోగ్య సమస్యలతో పాటు చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఉత్తమం అంటున్నారు. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jan 03, 2025 | 4:51 PM

అవిసె గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు.. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం. ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఇతర వంట నూనెల కంటే అవిసె గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
అవిసె గింజల నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ల నొప్పులను అదుపులో ఉంచుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ మాత్రమే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి.

2 / 5
ఈ నూనెలోని ఫైబర్ పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ అవిసె గింజల్లోని లిగ్నాన్స్, ఈస్ట్రోజెన్స్ ఎముకల బలానికి మంచిగా దోహదపడుతాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకునే ఈ నూనెతో పాటు అవిసె గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
ఈ నూనెను వాడేటప్పుడు వేడి చేయకుండా ఉండేందుకు సలాడ్లలో కానీ, విడిగా కానీ తీసుకోవడం మంచిది. అవిసె గింజలను పొడిచేసుకుని కూరలు వండేశాక చల్లుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని రొట్టెల పిండిలో కలిపి చపాతీలు కూడా చేసుకోవచ్చును.

4 / 5
అవిసె నూనె వాడితే ప్రోస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. కొలెస్టరాల్‌ శాతం తగ్గుతుంది. మెనోపాజ్‌ మహిళల్లో వేడి ఆవిర్లు తగుముఖం పడతాయి. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది. అవిసె నూనెను వేడి చేస్తే దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడుకోవటం ఉత్తమం అంటున్నారు.

5 / 5
Follow us
BSNLలో బెస్ట్‌ ప్లాన్‌.. 2026 వరకు వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా!

డబ్బులు పంపడానికి ఉత్తమ పద్ధతులు ఇవే.. చార్జీల బాదుడు ఇక దూరం

కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!

పాపం.. అడవి నుంచి నీళ్ల కోసం అని వస్తే.. గుండె తరుక్కుపోయే దృశ్యం

పవన్‌ను తల్చుకుంటూ గాల్లో తేలిపోతున్న రచ్చ రవి.. ఏమైందంటే?

బెల్లం,లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?100 రోగాలకు చెక్

పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!

క‌థ‌ రెడీ.. నిర్మాత రెడీ.. హీరోనే కరువు.. ఎవరా దర్శకులు.?

దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్దం..!

ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??