- Telugu News Photo Gallery Cinema photos Do you know who the crazy heroes of that time are now the villains?
Villains: అప్పట్లో క్రేజీ హీరోలు.. ఇప్పుడు నికార్సైన విలన్లు.. వారెవరు.?
తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనుసులు గెలిచి కనుమరుగైనవారు చాలామంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, కమెడియన్లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్ గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీల్లో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్ లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్ గా మారి రాణిస్తున్నవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jan 03, 2025 | 5:20 PM

లవ్ స్టోరీ మూవీస్ కి కేర్ అఫ్ అడ్రస్ అరవింద్ స్వామి. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధ్రువ చిత్రంతో విలన్ పాత్రతో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు.

అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

రవి కిషన్ శుక్ల.. రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పటి హీరో అని చాలామందికి తెలియని విషయం. అవును భోజ్ పురి, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు.

ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోల్లో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రం నుంచి విలన్ బాట పట్టారు.

2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లిగా అవకాశాలు తగ్గడంతో కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైఖేల్ చిత్రాల్లో విలన్ గా పలకరించారు.




