- Telugu News Photo Gallery Cinema photos Actress Sakshi Agarwal Gets Married To Her Childhood Love Navneet In Goa, Photos Viral
Sakshi Agarwal: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా.. ?
సినీరంగంలోని చాలా మంది తారలు గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల, కీర్తి సురేష్, ఆంటోని, రకుల్ ప్రీత్ సింగ్, కిరణ్ అబ్బవరం, రహాస్య గోరఖ్ వంటి సెలబ్రెటీస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది.
Updated on: Jan 03, 2025 | 5:54 PM

నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసింది సాక్షి.

దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయ్యింది. రాజా రాణి, కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది.

సహాయ పాత్రలే కాకుండా ఎన్నో సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది. అంతకు ముందు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. అలాగే సోషల్ మీడియలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది.

సాక్షి, నవనీత్ వివాహం గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రాతో సాక్షి కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

‘నవనీత్‌ని పెళ్లి చేసుకోవడం ఒక కల నిజమైంది. అతను ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి. కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది.ఈ కొత్త అధ్యాయం కోసం మేము ఎదురుచూస్తున్నాము' అంటూ రాసుకొచ్చింది.




