AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రాజకీయ వేడి..

ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.. లెక్కలు మారుతున్నాయి.. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే. మరీ ముఖ్యంగా US ప్రీమియర్స్‌లో ఎంత వస్తున్నాయనే చర్చ కూడా షురూ అయింది. మరిప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరగబోతుంది. మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..?

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రాజకీయ వేడి..
Game Changer
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2025 | 1:16 PM

Share

పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్‌మెన్ అయినా.. ఒకే ఒక్కడు అయినా.. ఇండియన్ అయినా..! సినిమా ఏదైనా ఇష్యూను తీసుకుని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. ఈ మధ్యే ఈ చిత్ర కథపై మేజర్ అప్‌డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లూ ఉండేవి.. కానీ ఉంటాయని తేల్చేసారు నిర్మాత దిల్ రాజు. జెంటిల్ మెన్‌లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కడులో కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయుడులో లంచం.. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కోటి చూపించారు. అయితే తనది గాని దారిలో వెళ్ళి.. ఐ, 2.0, ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనకబడ్డారు శంకర్. చాన్నాళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజే చెప్తున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికితోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్‌పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి.

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్. ముఖ్యంగా శంకర్ తన మార్క్ ప్లానింగ్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్‌ను USAలో చేసారు. ఫస్ట్ టైమ్ ఓ ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. డిసెంబర్ 21న జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేసారు గేమ్ ఛేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది.

ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాసాయి. దేవరకు ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే.. పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడికి 5.56 మిలియన్ డాలర్స్ వచ్చాయి. గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్‌లో పరీక్ష మొదలైందిప్పుడు. ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి. దిల్ రాజు బ్రాండ్ ఎలాగూ ఉంది. ఈ ముగ్గురూ కలిసి ఎన్ని మిలియన్స్ ఓపెనింగ్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. జనవరి 9న భారీగా US ప్రీమియర్స్ పడనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us