AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలెక్టర్లు మెచ్చినోళ్లు తుస్సుమంటే.. 285 స్ట్రైక్ రేట్‌తో ఛీ కొట్టినోడి విధ్వంసం..!

Syed Mushtaq Ali Trophy: రంజీ తర్వాత సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీతో దేశవాళీ క్రికెట్‌లో జోష్ మొదలైంది. నవంబర్ 14న జరిగిన తొలి రౌండ్‌లో బీహార్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ 18 పరుగులకే, కేరళ కెప్టెన్‌గా సంజూ శాంసన్ 4 పరుగులకే కుప్పకూలారు. కానీ ముంబై తరఫున మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21 బంతుల్లో 60*తో 285 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి టీమిండియా రిటర్న్‌కు గట్టి పిలుపునిచ్చాడు.

సెలెక్టర్లు మెచ్చినోళ్లు తుస్సుమంటే.. 285 స్ట్రైక్ రేట్‌తో ఛీ కొట్టినోడి విధ్వంసం..!
Smat 2026
Venkata Chari
|

Updated on: Nov 15, 2026 | 12:44 PM

Share

Syed Mushtaq Ali Trophy: ఒకవైపు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో బిజీగా ఉంటే.. మరోవైపు దేశంలో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) వేడెక్కింది. రంజీ తొలి దశ ముగియగానే మొదలైన ఈ పొట్టి ఫార్మాట్ సమరంలో స్టేట్ జట్ల తరఫున స్టార్లు బరిలోకి దిగారు. నవంబర్ 14న జరిగిన తొలి రౌండ్‌లో ముగ్గురు ప్రధాన ఆకర్షణలు ఉన్నారు – వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్. అందులో ఇద్దరు నిరాశపరిస్తే.. ఒక్కడు విధ్వంసం సృష్టించాడు.

వైభవ్‌కు కెప్టెన్సీ డెబ్యూ.. బ్యాట్‌తో మాత్రం నిరాశే..!

బీహార్ పగ్గాలు అప్పగించడం ద్వారా SMATలో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా అరంగేట్రం చేశాడు. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో టాస్‌కు రాగానే టీ20 ఫార్మాట్‌లో అత్యంత పిన్న వయసులో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

కానీ బ్యాట్‌తో మ్యాజిక్ రిపీట్ కాలేదు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 పరుగులు (స్ట్రైక్ రేట్ 150) చేసి చేతన్ సకారియా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆరంభంలో మెరుపులు మెరిపించినా.. పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. రాబోయే మ్యాచ్‌ల్లో అతడి నుంచి పెద్ద స్కోరు ఆశిస్తున్నారు అభిమానులు.

సంజూకు కష్టాలు.. మళ్లీ సింగిల్ డిజిట్..!

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా తరఫున విఫలమైన సంజూ శాంసన్.. కేరళ కెప్టెన్‌గా SMATలో బరిలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో కేరళ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఫామ్‌లోకి వస్తాడనుకుంటే.. సంజూ మళ్లీ నిరాశపరిచాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 3 బంతుల్లో 1 ఫోర్‌తో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాలతో అతడి ఫామ్ ఆందోళనకరంగా మారింది. ఇలాగే కొనసాగితే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జట్టులో చోటు ప్రమాదంలో పడటం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

21 బంతుల్లో 60*.. 285 స్ట్రైక్ రేట్‌తో సూర్య మెరుపులు..!

ఇద్దరు యంగ్ కెప్టెన్లు తడబడిన చోట.. మాజీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ చూపించాడు.

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన సూర్య.. కేవలం 21 బంతుల్లో 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 285.71. దీంతో ముంబై 173 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన సూర్యకు ఈ ఇన్నింగ్స్ టానిక్ లాంటిది. ఇదే దూకుడు కొనసాగితే టీమిండియాలోకి పునరాగమనం చేయడం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు. 360 డిగ్రీ షాట్లతో మళ్లీ సూర్య తన పాత రూపాన్ని చూపిస్తున్నాడనే చర్చ SMATకు హైలైట్‌గా మారింది.

మొత్తంగా SMAT తొలి రౌండ్ చెప్పిన కథ ఒక్కటే.. ఫామ్ శాశ్వతం కాదు, క్లాస్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. దానికి సూర్య ఇన్నింగ్సే నిదర్శనం!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్, శాంసన్ విఫలం.. కేక పెట్టించిన సూర్య..!
వైభవ్, శాంసన్ విఫలం.. కేక పెట్టించిన సూర్య..!
భారత్‌ Vs న్యూజిలాండ్‌.. మైదానంలో బిగ్ ఫైట్‌ను ఆపిన కోహ్లీ
భారత్‌ Vs న్యూజిలాండ్‌.. మైదానంలో బిగ్ ఫైట్‌ను ఆపిన కోహ్లీ
మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే..
మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే..
పాత పట్టు చీరల జరీలో నిజంగానే బంగారం, వెండి ఉంటాయా?ఎన్ని గ్రాములు
పాత పట్టు చీరల జరీలో నిజంగానే బంగారం, వెండి ఉంటాయా?ఎన్ని గ్రాములు
కారు ఇంజిన్ ఆయిల్ విషయంలో ఈ తప్పు చేస్తున్నారా?
కారు ఇంజిన్ ఆయిల్ విషయంలో ఈ తప్పు చేస్తున్నారా?
చికెన్ కర్రీలో నీచు వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..
చికెన్ కర్రీలో నీచు వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..
మరో రాప్తాడు ఘటన షోరూమ్‌లోకి వెంటాడి 17ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య
మరో రాప్తాడు ఘటన షోరూమ్‌లోకి వెంటాడి 17ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య
గిరిబాబు చిన్న కుమారుడు తెలుగులో ఫేమస్ హీరో.. కానీ ఇప్పుడేమో..
గిరిబాబు చిన్న కుమారుడు తెలుగులో ఫేమస్ హీరో.. కానీ ఇప్పుడేమో..
ఆ పాట పాడేటప్పుడు భయమేసింది.. ఎవరైనా వచ్చి తిడతారేమో
ఆ పాట పాడేటప్పుడు భయమేసింది.. ఎవరైనా వచ్చి తిడతారేమో
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..