AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి.. తెలుగు తెరకి పరిచయమవుతున్న బ్యూటీ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లతో తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు దుల్కర్. ఇప్పుడు ఆకాశంలో ఒక తార అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి.. తెలుగు తెరకి పరిచయమవుతున్న బ్యూటీ
Satvika
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2026 | 11:59 AM

Share

మలయాళీ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ఆకాశంలో ఒక తార. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమె సినిమా విశేషాలతో పాటు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన సాత్విక, తన మాస్టర్స్ పూర్తి చేశాక ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచే కళల పట్ల ఉన్న అంతులేని మక్కువతో నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తండ్రి తెలుగువారు, తల్లి కోల్‌కతాకు చెందినవారైనా కుటుంబం చెన్నైలో స్థిరపడటంతో సాత్వికకు దక్షిణాది సంస్కృతి, భాషలతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది.. ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేది: మంజు భార్గవి

తొలుత ‘కాంత’ చిత్రం కోసం ఆడిషన్ ఇచ్చినప్పటికీ అప్పుడు అవకాశం రాలేదు. కానీ అదే బ్యానర్‌లో మరో తమిళ ప్రాజెక్ట్‌కు ఎంపికై ఆమె ఇండియాకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో హీరోయిన్‌గా నటించే సువర్ణావకాశం తలపు తట్టింది. ఈ క్రేజీ ఆఫర్‌తో అమెరికాలోని తన ఉద్యోగానికి పూర్తిగా రాజీనామా చేసి, ఫుల్‌టైమ్ నటిగా మారిపోయారు. ఒక్క సినిమా చేసి వెళ్దామనుకున్న ఆమెకు, ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతుండటం విశేషం. ఈ చిత్రంలో తాను కల్పన అనే ఒక స్వచ్ఛమైన, అమాయకపు పల్లెటూరి యువతిగా కనిపించనున్నట్లు సాత్విక వెల్లడించారు. ఎప్పుడూ కామ్ గా ఉంటూ, ఆకాశంలోకి, అంతరిక్షంలోకి వెళ్లాలనే ఒక అసాధారణమైన గొప్ప కల కనే అమ్మాయి పాత్ర ఆమెది. చుట్టూ ఉన్నవారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిరుత్సాహపరిచినా తన లక్ష్యం వైపే అడుగులు వేసే కల్పన పాత్ర ప్రతి ఒక్కరికీ చక్కటి స్ఫూర్తినిస్తుందని ఆమె ఎంతో ధీమా వ్యక్తం చేశారు.

Mahesh Babu: వార్ని.. మహేష్‌తో ఉన్న ఈ అమ్మాయి ఆ హీరోయినా.! ఎంత మారిపోయింది గురూ !!

అమెరికా మోడరన్ వాతావరణంలో పెరిగిన సాత్వికకు, ఒక పల్లెటూరి అమ్మాయి బాడీ లాంగ్వేజ్‌ని ఒదిగిపోవడం పెద్ద సవాలుగా నిలిచిందట. దీనికోసం ఆమె ప్రత్యేకంగా తెలుగు భాషపై పట్టు సాధించేందుకు శిక్షణ కూడా తీసుకున్నారు. కాగా, సాత్వికకు నటనతో పాటు కర్ణాటక సంగీతం, భరతనాట్యంలోనూ అద్భుతమైన ప్రావీణ్యం ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు, కానీ ఈ చిత్రంలో ఒక అమ్మాయి తన ఉన్నతమైన లక్ష్య సాధన వెనుక ఒక గొప్ప మనసున్న అబ్బాయి ఎలా అండగా నిలబడ్డాడనేది హృదయానికి హత్తుకునేలా చూపించామని సాత్విక పేర్కొన్నారు. సినిమాలో ‘కృష్ణ’ పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ తనకు షూటింగ్ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా షూటింగ్ మొదటి రోజు ఒక జాతర సన్నివేశంలో తాను కొంచెం కంగారు పడినప్పుడు, దుల్కర్ ఇచ్చిన చిన్న మాట, భరోసా తన భయాన్ని పూర్తిగా పోగొట్టాయని తెలిపారు. అలాగే సెట్స్‌లో శ్రుతి హాసన్ ఎనర్జీ, రుహాని శర్మ సహకారం తనకు ఎంతో నేర్పించాయని చెప్పకొచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని అన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ టీజర్, సాంగ్స్ కి యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజువల్స్, ఎమోషన్స్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఆయన సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us