AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giri Babu: గిరిబాబు చిన్న కుమారుడు గురించి తెలుసా? తెలుగులో ఫేమస్ హీరో.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..

. టాలీవుడ్ ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూతతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సినిమా సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఆయనమరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన గిరిబాబు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే గిరిబాబుకు ఇద్దరు కుమారులు. అందులో రఘుబాబు మనందరికి తెలసిన నటుడే.. కానీ..

Giri Babu: గిరిబాబు చిన్న కుమారుడు గురించి తెలుసా? తెలుగులో ఫేమస్ హీరో.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
Giri Babu Family
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 12:22 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం. సుమారు 600కు పైగా సినిమాల్లో నటించిన గిరిబాబు (80) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న ఆయన శనివారం (నవంబర్ 14) కన్నుమూశారు. దీంతో నటుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు కూడా గిరిబాబు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. గిరిబాబు మరణం నేపథ్యంలో ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. గిరిబాబు దాదాపు 600 సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారాయన. ఇక గిరిబాబు పెద్ద కుమారుడు రఘుబాబు కూడా టాలీవుడ్ లో బాగా ఫేమస్. 1990 లో దొంగలు ఉన్నారు జాగ్రత్త సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు మురారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీ, ఆది, చెన్నకేశవరెడ్డి.. ఇలా ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా నటించి మెప్పించారు రఘుబాబు. రీసెంట్ గా రిలీజైన దొంగ నా కొడుకు (డీఎన్ కే) సినిమాలోనూ హీరోయిన్ తండ్రిగా ఆకట్టుకున్నారు రఘుబాబు.

కాగా చాలా మందికి తెలియన విషయమేమిటంటే.. రఘుబాబు చిన్న కుమారుడు బోసు బాబు కూడా చాలా సినిమాల్లో నటించాడు. అది కూడా హీరోగానే. 1990లో బోసుబాబు హీరోగా ఇంద్రజిత్ అనే సినిమాను తెరకెక్కించారు గిరిబాబు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరించారు గిరిబాబు. కౌబాయ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది. హీరోగా బోసు బాబుకు కూడా మంచి గుర్తింపే వచ్చింది. మరిన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.  దీని తర్వాత నిమజ్జనం, చెమ్మచెక్క, స్టంట్ మ్యాన్ తదితర సినిమాల్లో హీరోగా నటించారు బోసుబాబు. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు బోసుబాబు.  ప్రస్తుతం ఆయన బిజినెస్ చేస్తున్నట్లు తెలస్తోంది. ఇక గిరిబాబు భార్య పేరు శ్రీదేవి. 2016లో ఆమె కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరు కుమారులతో నటుడు గిరిబాబు..

Giri Babu Family 1

Giri Babu Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us