Sprouted Coconut: కొబ్బరికాయలో పువ్వు వస్తే వదలకుండా తినేయండి..ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు
క్యాన్సర్ నుండి రక్షణ కొబ్బరిపువ్వులోని పోషకాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిపువ్వును తినడం వల్ల మీరు అందమైన జుట్టు, ఆరోగ్యమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మంపై చారలు, ముడతలు, మచ్చలు మొదలైన వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.
సాధారణంగా దేవుడికి కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో అప్పుడప్పుడు పువ్వు రావటం చూస్తుంటాం.. దీనిని మనం శుభసూచకంగా భావిస్తాం. అంతేకాదు.. ఈ కొబ్బరి పువ్వును తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన కొబ్బరిని కొబ్బరి యాపిల్స్ అంటారు. అందుకే కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దానిని వదలకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కొబ్బరిపువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
కొబ్బరి పువ్వును తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిపువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీపెరాసిటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి పువ్వు తినటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి పువ్వు మీ జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. అదనపు కొవ్వు కరిగించి సరైన శరీర ఆకృతిని పొందడంలో సహాయపడుతుంది. పోషకాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి పువ్వు అనేక పోషకాలకు పవర్ హౌజ్‌గా చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
పోషకాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి పువ్వు అనేక పోషకాలకు పవర్ హౌజ్‌గా చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొలకెత్తిన కొబ్బరికాయలను తినడం వల్ల శరీరానికి పోషణ అంది నిండైన ఆరోగ్యం లభిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. డయాబెటిక్‌తో ఇబ్బంది పడుతున్న వారు కూడా కొబ్బరిపువ్వును ఆనందంగా తినవచ్చు అంటున్నారు నిపుణులు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..