AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దుబాయి వీధుల్లో సందడి చేసిన రంగురంగుల నెమళ్లు.. నెట్టింట్లో వైరల్ వీడియో..

నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు చాలవు. అయితే వీటిని ఎక్కువగా అడవుల్లోనూ లేదా పార్కుల్లో మాత్రమే చూడగలం.

Viral Video: దుబాయి వీధుల్లో సందడి చేసిన రంగురంగుల నెమళ్లు.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Basha Shek
| Edited By: |

Updated on: Jan 23, 2022 | 9:26 AM

Share

నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు చాలవు. అయితే వీటిని ఎక్కువగా అడవుల్లోనూ లేదా పార్కుల్లో మాత్రమే చూడగలం. జనావాసాల్లో కనిపించడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 50 నెమళ్లు దుబాయి రోడ్లపై కొచ్చాయి. ఇందులో ఆడ, మగ నెమళ్లు కలిసి గుంపుగా ఉండడం గమనార్హం. సాధారణంగా అవి రెండు ఒక చోట తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని కలిసి పోయి రోడ్డుపై వెళ్లే వారికి కనువిందు కలిగించాయి. దీంతో చాలామంది తమ కెమెరాలు, మొబైల్ ఫోన్లకు పని చెప్పారు. ఆ అందమైన దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఈక్రమంలో ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి ప్రస్తుతం దుబాయిలో పర్యటిస్తోంది.  ఆమె కళ్లకు కూడా ఈ అందమైన నెమళ్లు కనిపించాయి. వెంటనే వాటిని తన కెమెరాలో బంధించింది. అనంతరం తన అభిమానులకు చూపించేందుకు సోషల్ మీడియాలో వాటిని పంచుకుంది.  ఇంతటి మనోహరమైన దృశ్యం చూసి నా మనసు పులకరించి పోతుందంటూ అమె ఈ సందర్భంగా  చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ అందమైన నెమళ్ల వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇందులో ఒక నెమలి  ఎంతో అందంగా పురివిప్పి నాట్యం చేయడం నెటిజన్లను బాగ ఆకట్టుకుంటోంది. వీటిని చూసిన వారందరూ ‘అమేజింగ్ వీడియో’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Mini Mathur (@minimathur)

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Follow Us