5 లారీలు.. 7 కార్లు.. హైవేపై భయానక యాక్సిడెంట్.. అసలేం జరిగిందో తెలుసా..?
నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఇందల్‌వాయి మండలం చంద్రయాన్‌పల్లి సమీపంలో ఒక లారీ టైరు పంచర్ కావడంతో రోడ్డుపైనే నిలిపివేయగా, వెనుక నుంచి వచ్చిన వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. మొత్తం ఐదు లారీలు, ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొబ్బరి బొండాల లారీ పొలంలో బోల్తాపడగా, మరికొన్ని వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నిజామాబాద్ జిల్లా 44 వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎప్పడు లేనివిధంగా అధిక సంఖ్యలో వాహనాలు ఢీకొనటం, అక్కడి పరిస్ధితి భయానకంగా మారటం కలకలం రేపింది. హైవే పై ఏం జరిగిందో తెలియక ఇతర వాహనదారుల స్థానికులు అయోమయానికి గురయ్యారు. లారీ టైరు బ్లాస్ట్ కావటం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లారీని రోడ్డు పక్కకు ఆపి రిపేర్ చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్తున్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం చంద్రయాన్ పల్లి 44 వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం లారీ టైరు పేలడం అని పోలీసులు భావిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లారీలు, ఏడు కార్లు ఒకేసారి ఒకదానికొకటి ఢీకొట్టడంతో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఐదు లారీలు ముందు భాగం ధ్వంసం కాగా కొబ్బరి బొండాల లోడ్‌తో వెళ్తున్న మరో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లో బోల్తాపడింది. ఒకదాని కొకటి వరుసగా 12 వాహనాలు ఢీకొనడంతో రహదారి రక్తసిక్తమైంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో పోలీసులు క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రయాన్పల్లి గ్రామశివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ లారీ టైరు పంచర్ అయింది. టైరు మార్చుకునేందు కు డ్రైవర్ లారీని రోడ్డుపై నిలిపాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం లారీని బలంగా ఢీకొట్టడంతో ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్, క్లీనర్లకు గాయాలు అయ్యాయి. రెండు వాహనాలు రోడ్డుపైనే ఉండటంతో అదే సమయంలో వెనుకనుంచి ‘వచ్చిన కొబ్బరి బొండాల లారీ వాటిని తప్పించే క్రమంలో రోడ్డు కింది భాగంలోకి దూసుకెళ్లి పొలంలో బోల్తాపడింది. పెద్ద ఎత్తున ప్రమాదం జరగడంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు ఒకదాని వెనుక ఒకటి నిలిచిపోయాయి. ఆ సమయంలో పశువుల ఎరువు లోడ్ చేసుకొని వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ముందు ఉన్న కార్లను బలంగా ఢీకొట్టడంతో ఏడు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. మరో రెండు లారీలకు సైతం ప్రమాదం జరిగింది.
వీడియో చూడండి..
మొత్తంగా ఏడు కార్లు, ఐదు లారీలు ప్రమాదానికి గురయ్యాయి. కార్లలో ఉన్న వార్లలో వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరొకరి కాలు విరుగగా పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను టోల్ ప్లాజా అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటలపాటు జాతీయ రహదారిపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే టైరు పేలిన లారీ రోడ్డుపైనే నిలిపివేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అటు స్థానికులు కూడా చెప్తున్నారు. లారీని రోడ్డు పక్కకు నిలిపి ఉండాల్సిందని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
