Hardik Pandya : మైండ్ బ్లోయింగ్ ట్రేడ్.. హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను బలి ఇవ్వనున్న సీఎస్కే?
Hardik Pandya : ఐపీఎల్ 2027 ట్రేడ్ విండో లో హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడన్న ప్రచారం జోరందుకుంది. శివం దూబే, ఆయుష్ మ్హాత్రే లేదా డెవాల్డ్ బ్రెవిస్ తో ట్రేడ్ జరిగే అవకాశాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ సాగుతోంది.

Hardik Pandya : ఐపీఎల్ వేలం అయినా లేదా ట్రేడింగ్ అయినా.. తక్కువ ధరలోనే అద్భుతమైన టాలెంట్ కలిగిన ఆటగాళ్లను సొంతం చేసుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే ఈసారి రిపోర్టుల ప్రకారం సిఎస్‌కే మేనేజ్‌మెంట్ తమ లిమిట్స్ దాటి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం ఎంతటి పెద్ద నిర్ణయానికైనా సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకుని మైండ్ బ్లాక్ చేసిన CSK, ఈసారి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తెచ్చుకోవడానికి ముంబై ఇండియన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్ల త్యాగం?
తాజా నివేదికల ప్రకారం… టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ 2026 విజేత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా చెన్నైకి మిడిల్ ఆర్డర్ వెన్నెముకగా నిలిచిన శివం దూబేలను ముంబైకి ఇచ్చి, వారి స్థానంలో హార్దిక్ పాండ్యాను CSK తెచ్చుకోబోతోందని రూమర్స్ వస్తున్నాయి. ఆయుష్ మ్హాత్రే అద్భుతమైన యంగ్ టాలెంట్ కాగా, దూబే ఫినిషర్‌గా అనేక మ్యాచ్‌లను గెలిపించాడు. కానీ, డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ తర్వాత సరైన ఆల్‌రౌండర్ లేక సిఎస్‌కే ఇబ్బంది పడుతుండటంతో హార్దిక్ వైపు మొగ్గు చూపుతోంది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు పెద్ద ఉపశమనం
ఒకవేళ హార్దిక్ పాండ్యా చెన్నై జట్టులోకి వస్తే, అది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పనిని చాలా సులువు చేస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రుతురాజ్‌కు హార్దిక్ రూపంలో పూర్తి స్థాయి ఆప్షన్ లభిస్తుంది. అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ డెప్త్ కోసం 8, 9 స్థానాల వరకు ఆల్‌రౌండర్లతో నింపాల్సిన అవసరం ఉండదు. మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ ఉండటం వల్ల పక్కా స్పెషలిస్ట్ బౌలర్‌ను తుది జట్టులో ఆడించే వెసులుబాటు కలుగుతుంది. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మిడిల్ ఆర్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా రంగంలోకి దించే అవకాశం ఉంటుంది.
ముంబైకి దూబే, బ్రెవిస్ ఆఫర్?
అయితే ఈ ట్రేడ్‌కు సంబంధించి మరొక ప్రచారం కూడా సాగుతోంది. ఆయుష్ మ్హాత్రేకు బదులుగా సౌతాఫ్రికా హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబేలను ముంబైకి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే చెన్నైకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్రెవిస్, దూబే ఇద్దరూ జట్టులో క్లాస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, మెయిన్ ఫినిషర్లు. వీరిద్దరూ జట్టును వీడితే మిడిల్ ఆర్డర్‌లో మళ్లీ ఖాళీ ఏర్పడే ప్రమాదం ఉంది.
ధోనీ, ఫ్లెమింగ్ లేని సిఎస్‌కే కొత్త ప్లానింగ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు ఎంఎస్ ధోనీ తర్వాతి యుగం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఐపీఎల్ 2027 నాటికి ఆయన అందుబాటులో ఉండరు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అనుభవజ్ఞుడైన హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌లతో కలిసి చెన్నైకి నాయకత్వం వహించడం, జట్టును సరైన దారిలో నడిపించడం సులువవుతుందని చెన్నై భావిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
