AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!

తెలంగాణలోని నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తాజాగా ఆ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీని కూడా ప్రకటించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!
Tgprb Police Jobs Application Dates Released
Anand T
|

Updated on: Aug 01, 2026 | 2:46 PM

Share

రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గత వారం తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పోస్టులకు సంబంధించి తాజాగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో కీలక ప్రకటన చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

మొత్తం నాలుగు విభాగాల్లో సివిల్ కానిస్టేబుల్, SPF, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో కీలక సూచన కూడా చేసింది. కేవలం www.tgprb.in, http://www.tgprb.in వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని, వీటి ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ముందు Aadhaar App ద్వారా Aadhaar Face Authentication పూర్తి చేసుకోవాలని తెలిపింది.

పోస్టుల వారీగా దరఖాస్తు రుసుము

పోస్టు రకం SC / ST అభ్యర్థులకు ఇతరులకు
SI పోస్టులు ₹750 ₹1,500
కానిస్టేబుల్ పోస్టులు ₹600 ₹1,200

గమనిక: ఒకే PMT/PET ద్వారా బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే అదనపు దరఖాస్తులపై ఫీజు రాయితీ కూడా ఉంటుందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై కీలక ప్రకటన
కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై కీలక ప్రకటన
హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను బలి ఇవ్వనున్న సీఎస్కే?
హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను బలి ఇవ్వనున్న సీఎస్కే?
బెండకాయల్ని మార్కెట్ నుండి తెచ్చాక ఈ చిన్న పనిచేస్తే మెత్తబడవు!
బెండకాయల్ని మార్కెట్ నుండి తెచ్చాక ఈ చిన్న పనిచేస్తే మెత్తబడవు!
మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా..
మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా..
ఒకే ఒక్క సినిమా.. 30 లిప్ లాక్స్.. కట్ చేస్తే
ఒకే ఒక్క సినిమా.. 30 లిప్ లాక్స్.. కట్ చేస్తే
ఊరెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సుకే ఎసరు..!
ఊరెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సుకే ఎసరు..!
కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దీనిది చిన్న కథ కాదు!
కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దీనిది చిన్న కథ కాదు!
కరకరలాడే చెక్కలు..పిండి కలిపేటప్పుడు ఈ టిప్ పాటిస్తే నూనె పీల్చవు
కరకరలాడే చెక్కలు..పిండి కలిపేటప్పుడు ఈ టిప్ పాటిస్తే నూనె పీల్చవు
దోచేయ్ లో చైతన్య చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
దోచేయ్ లో చైతన్య చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మీకు ఇలా అనిపిస్తుందా..?
జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మీకు ఇలా అనిపిస్తుందా..?