Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Women1
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 22, 2022 | 9:51 PM

గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో ఆనందంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు తెలుసుకుంటే ఏ సందర్భంలోనైనా మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఉండటం వల్ల మీకు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, మీలోపల హార్మోన్ల మార్పుల వల్ల కలిగే అన్ని సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. మీరు సంతోషంగా ఉంటే మీ బిడ్డకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. గర్భధారణ సమయంలో సంతోషంగా ఉండటం వల్ల కలిగే అన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుంద్దాం

ఒత్తిడి నుండి బయటపడతారు

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీకి తరచుగా మానసిక సమస్యలు ఉంటాయి. దీనివల్ల కోపం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తుంటాయి. కానీ ఒక మహిళ సంతోషంగా ఉంటే, ఆమె లోపల ఆనందానికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. ఈ విధంగా ఆమె ఒత్తిడి సమస్య నుండి బయటపడతుంది.

BP ప్రమాదం తగ్గుతుంది

గర్భధారణ సమయంలో హై బీపీ సమస్య ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కోసారి బీపీ ఎక్కువై గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అధిక బీపీకి ఒత్తిడి కూడా ప్రధాన కారణం. ఒత్తిడిని అదుపు చేసుకోగలిగితే హైబీపీ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీకి చాలాసార్లు వెన్నునొప్పి, తలనొప్పి, కాళ్లలో నొప్పి, అలసట మొదలైన సమస్యలు, శరీరంలో వాపు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు సంతోషంగా ఉంటే

పిల్లల మెరుగైన అభివృద్ధి

గర్భధారణ సమయంలో తల్లి చేసే చర్యలు పిల్లల మానసిక ఎదుగుదలను కూడా ప్రభావితం చేస్తాయి.

Read Also.. Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 10 ఆహారాలను మీ డైట్‌లో చేర్చాల్సిందే..!