Sleep Habits: మీరు నిద్ర పోయే సమయంలో ఎక్కువసేపు ఈ భంగిమలో పడుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవట..

Sleep Habits: మీరు నిద్ర పోయే సమయంలో ఎక్కువసేపు ఈ భంగిమలో పడుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవట..
Weight Loss

చలికాలం.. పెరిగిపోతున్న చలి.. అందులోనూ తెల్లవారుజాము.. ఇంకేముంది వెచ్చగా దుప్పటి కప్పుకుని కాసేపు పడుకోవాలని(Sleeping) అనిపించని వారు ఎవరూ ఉండరు. ఉదయాన్నే లేవాల్సిన పని ఉంది అలారం పెట్టుకున్నా.. దాని పీక నొక్కేసి మరీ మరో పది నిమషాలు ముసుగేసుకుని పడుకోవడం సహజం.

KVD Varma

|

Jan 22, 2022 | 8:03 PM

చలికాలం.. పెరిగిపోతున్న చలి.. అందులోనూ తెల్లవారుజాము.. ఇంకేముంది వెచ్చగా దుప్పటి కప్పుకుని కాసేపు పడుకోవాలని(Sleeping) అనిపించని వారు ఎవరూ ఉండరు. ఉదయాన్నే లేవాల్సిన పని ఉంది అలారం పెట్టుకున్నా.. దాని పీక నొక్కేసి మరీ మరో పది నిమషాలు ముసుగేసుకుని పడుకోవడం సహజం. అయితే, ఇలా పడుకునే సమయంలో మీరు ఏ భంగిమలో నిద్రపోతున్నారు? ఇది చాల ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మహిళలకు(Women) కొన్ని భంగిమలలో పడుకోవడం చెడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటిలోనూ పొట్టమీద పడుకోవడం అంటే మన వాడుక భాషలో బోర్లా పడుకోవడం మహిళలకు ఆరోగ్య సమస్యలు తీసుకువస్తుందని వారు చెబుతున్నారు. సాధారణంగా మహిళలు రోజంతా కుటుంబ పనులు నిర్వహించి అలసిపోయి.. ఇలా పడుకోవడం సహజం. వీపు .. శరీరంలో దృఢత్వం లేదా చల్లని వాతావరణంలో కడుపులో నొప్పి కారణంగా, వారు ఇలా నిద్రపోవడం చేస్తారు. ఈ భంగిమలో(Sleep Direction) పడుకోవడం వల్ల శరీరం శ్వాస తీసుకోవడంలో ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి వస్తుంది. ఈ విధంగా నిద్రిస్తున్న శరీరం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఉంటుంది. అటువంటప్పుడు నిద్ర నుంచి మేలుకున్న తర్వాత కూడా, ఈ సమస్య శరీరం పై కొనసాగుతుంది. ఎందుకంటే శరీరం ఎగువ భాగం బరువు పూర్తిగా ఛాతీపై పడటం వలన ఇలా జరుగుతుంది.

ఈ భంగిమలో పడుకోవడం ఆరోగ్యానికి ఎందుకు హానికరం?

రొమ్ము నొప్పి – మహిళలు ఈ భంగిమలో పడుకోవడం వల్ల తరచుగా రొమ్ము నొప్పితో సమస్యలు ఉంటాయి. ఇలా గంటల తరబడి పడుకోవడం వల్ల రొమ్ముపై ఒత్తిడి పడుతుంది, దీని వల్ల నొప్పి వస్తుంది.

ముడతలు – పొట్టపై పడుకోవడం వల్ల స్తనాలే కాకుండా ముఖం కూడా ఒత్తుతుంది. దీని వల్ల ఊపిరి పీల్చుకోవాదం కష్టంగా మారుతుంది.. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు .. మొటిమల సమస్య మొదలవుతుంది.

అజీర్ణం – ఇలా పడుకోవడం వల్ల పొట్ట ఒత్తిడికి గురవుతుంది. ఈ కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, ఇది మలబద్ధకం .. అజీర్ణానికి దారితీస్తుంది.

తలనొప్పి – మీరు కడుపు మీద పడుకోవడం వల్ల తలనొప్పి వస్తుంది. వాస్తవానికి, ఈ విధంగా నిద్రపోతున్నప్పుడు, మెడ నిటారుగా ఉండదు, దీని కారణంగా మెదడుకు రక్త సరఫరా ప్రభావితమవుతుంది, ఇది తలనొప్పి .. కొన్నిసార్లు మెడ నొప్పికి కారణమవుతుంది.

ప్రెగ్నెన్సీలో డేంజర్ – ప్రెగ్నెన్సీ రెండవ .. మూడవ త్రైమాసికంలో, ఇలా నిద్రపోవడం సాధ్యం కాదు, కానీ మొదటి త్రైమాసికంలో, ఈ విధంగా నిద్రపోవడం గర్భం మీద ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున కూడా ఇలా నిద్రపోకూడదని వైద్యుల అభిప్రాయం.

పొట్టపై పడుకోవడం వలన ఈ ఉపయోగమూ ఉంది..

బోర్లా నిద్రపోవడం వల్ల అనేక నష్టాలు ఉన్నట్లే, దాని వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వెన్నునొప్పి లేదా కడుపు నొప్పి సమయంలో కడుపుపై ​​నిద్రపోవడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. గురకకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నవారు కూడా ఇలాగే పడుకోవాలి, అప్పుడు గురక స్లో అవుతుంది. కానీ, ఈ విధంగా పడుకునే ప్రక్రియ కొంత సమయం వరకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా గంటల తరబడి నిద్రపోవడం మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇక్కడ తెలియచేస్తున్న విషయాలు వివిధ సమయాల్లో నిపుణులు వ్యక్తీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఇస్తున్నవి. ఇవి ప్రాధమిక అవగాహన కోసం అందచేస్తున్నాము. వీటి గురించి మరింత స్పష్టంగా మీ వైద్యుల నుంచి తెలుసుకుని ఆచరించాల్సి ఉంటుంది.

Also Read: Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 10 ఆహారాలను మీ డైట్‌లో చేర్చాల్సిందే..!

Fitness Tips: ఇలా చేస్తే చాలు.. జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఫిట్‌గా ఉండొచ్చు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu