LPG Gas: భారీ దెబ్బ.. ఇక నుంచి వీరికి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు నిషేధం.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
LPG Gas: యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న వారికి ఇప్పటికి అందలేదు. అయితే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీరు గ్యాస్ సిలిండర్లను పొందలేరు..

LPG Gas: పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ సిలిండర్లను పొందడం లేదా రీఫిల్ చేసుకోవడాన్ని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నిషేధించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తిన తరుణంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్‌కు ఉన్న సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు రాయితీతో కూడిన ఎల్పీజీని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు అలాగే పంపిణీని మెరుగుపరిచేందుకు శనివారం ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వును సవరించారు.
కొత్త సరఫరా ఆర్డర్‌లో ఏముంది?
కొత్త సరఫరా ఉత్తర్వు ప్రకారం.. ఇప్పటికే పీఎన్‌జీ నెట్‌వర్క్‌కు యాక్సెసిబిలిటీ ఉన్నవారికి కొత్త ఎల్‌పిజి కనెక్షన్‌లు లేదా రీఫిల్‌లు జారీ చేయడాన్ని ప్రభుత్వం చమురు కంపెనీలను నిషేధించింది. అంతేకాకుండా, పీఎన్‌జీ కనెక్షన్‌లు ఉన్నవారు తమ ఎల్‌పిజి కనెక్షన్‌లను కొనసాగించకుండా కూడా నిరోధిస్తారు. అంటే, ఇప్పటికే పీఎన్‌జీ, ఎల్‌పిజి కనెక్షన్‌లు రెండూ ఉన్న కుటుంబాలు తమ ప్రస్తుత ఎల్‌పిజి కనెక్షన్‌లను వదులుకోవలసి ఉంటుంది.
ఇది కూడా చదవండి: SBI: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ భారీ కానుక..!
భారత జెండా కలిగిన రెండు ఎల్‌పిజి నౌకలు సుమారు 92,700 టన్నుల ఎల్‌పిజితో హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి భారతదేశం వైపు పయనిస్తున్నాయి. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన పర్షియన్ గల్ఫ్‌లో 24 భారత జెండా కలిగిన నౌకలు నిలిచి ఉన్నాయని, వాటిలో ఎల్‌పిజిని తీసుకువెళ్తున్న శివాలిక్, నందా దేవి నౌకలు సురక్షితంగా మార్గాన్ని దాటాయని, త్వరలో భారత ఓడరేవులకు చేరుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. అవి మార్చి 16, 17 తేదీలలో ముంద్రా, కాండ్లా ఓడరేవులకు చేరుకుంటాయని అంచనా.
ఇది కూడా చదవండి: LPG Cylinder: గ్యాస్ సిలిండర్ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
ఇది కూడా చదవండి: Auto News: ఇది మైలేజీలో రారాజు.. లీటర్ పెట్రోల్‌కు 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




