AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Finance: అత్యవసర సమయంలో లోన్‌ తీసుకోవాలా? లేదా SIPని ఆపేయాలా?

Personal Finance: అత్యవసర పరిస్థితి చేస్తే క్రెడిట్ కార్డులు, అధిక వడ్డీ పర్సనల్ లోన్ల జోలికి వెళ్లకుండా మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం (LAMF) తీసుకోవడం లేదా తాత్కాలికంగా సిప్‌ పాజ్ మంచిది. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కనీసం..

Personal Finance: అత్యవసర సమయంలో లోన్‌ తీసుకోవాలా? లేదా SIPని ఆపేయాలా?
Personal Finance
Subhash Goud
|

Updated on: Aug 03, 2026 | 9:04 AM

Share

Personal Finance: డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మార్గాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, ఉద్యోగం పోవడం, ఊహించని పెద్ద రిపేర్లు.. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం పర్సనల్ లోన్ లాంటిది తీసుకోవాలా? లేక ఏళ్లుగా కొనసాగుతున్న మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (SIP)ని ఆపేసి అందులో ఉన్న డబ్బును విత్‌డ్రా చేసుకోవాలా? దీనిపై నిపుణులు ఎలాంటి సహాలు ఇస్తున్నారో తెలుసుకుందాం..

ఎమర్జెన్సీ ఫండ్ ప్రాధాన్యత:

గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు, సీఏ దివం శర్మ ప్రకారం.. అసలు ఇన్వెస్టర్లు ఇలాంటి గందరగోళంలో పడకుండా ఉండటమే చాలా ముఖ్యమంటున్నారు. ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కనీసం 3 నుంచి 6 నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో డబ్బు లేనప్పుడు కొనసాగుతున్న SIPని నిలిపివేసి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలా? లేక లోన్ తీసుకోవాలా? అనే సమస్య వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. నగదు అవసరం కోసం మ్యూచువల్ ఫండ్స్‌లోని డబ్బును విత్‌డ్రా చేయడం లేదా సిప్‌నిని ఆపివేయడం వల్ల కంపౌండింగ్ (చక్రవడ్డీ) బెనిఫిట్స్‌ కోల్పోవల్సి ఉంటుంది. దానితో పాటు ఎగ్జిట్ లోడ్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పడే అవకాశం ఉంది. అలాగే మున్ముందు మార్కెట్లు కోలుకుంటే వచ్చే భారీ లాభాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: Gold: భారత్‌లో బంగారం ధర రూ.37,000 మేర తగ్గినా, ప్రజలు ఎందుకు కొనడం లేదు.. అసలు కారణం ఇదేనా?

ఇవి కూడా చదవండి

క్రెడిట్ కార్డ్ లోన్ vs సిప్‌ని ఆపడం:

రుణం తీసుకునే ముందు దానిపై పడే రేటు వడ్డీను, మీ మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే లాభాలను సరిపోల్చి చూసుకోవాలి.

భారీ వడ్డీలు: క్రెడిట్ కార్డులు లేదా అధిక వడ్డీ పర్సనల్ లోన్లు (20%-30%) తీసుకోవడం, తాత్కాలికంగా సిప్‌ని ఆపివేయడం మేలు. 20-30% వడ్డీకి అప్పు చేసి, మార్కెట్‌లో అంతకంటే తక్కువ లాభం ఆశించడం ఆర్థిక నిర్ణయం కాదని సెబీ రిజిస్టర్డ్‌వెస్ట్‌మెంట్ అడ్వైజర్ (RIA) శశాంక్ ఉడుప తెలిపారు. తక్కువ వడ్డీకి లోన్ దొరికి, దానిని కొద్ది నెలల్లోనే సులభంగా తీర్చగలిగే సామర్థ్యం ఉంటే.. సిప్‌ని ఆపకుండా తీసుకోవడమే మంచిది. సిప్‌ని ఆపడానికి లేదా ఫండ్స్ విత్‌డ్రా చేయడానికి బదులుగా ‘లోన్ ఎగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్’ (మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ – LAMF) అత్యుత్తమ మార్గం. ఇందులో మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తాకట్టు పెట్టి రుణం పొందుతారు. సాధారణంగా ఏడాదికి 9% 11% వరకు మాత్రమే వడ్డీ ఉంటుంది. మీ పెట్టుబడులు మార్కెట్‌లోనే కొనసాగుతాయి. అందుకే మార్కెట్ పెరుగుదల వల్ల వచ్చే లాభాలను మీరు కోల్పోతారు.

చిన్న బ్రేక్ ఎంత పెద్ద నష్టాన్ని తెస్తుందో తెలుసా? (ఉదాహరణతో..)

‘Wealthy.in’ కో-ఫౌండర్ ఆదిత్య అగర్వాల్ ప్రకారం.. సిప్‌ని మధ్యలో ఆపివేస్తే లాంగ్ టర్మ్‌లో కలిగే నష్టం చాలా పెద్దది.

రూ. 20,000 SIP నిలిపివేస్తే:

మీరు నెలకు రూ. 20,000 చొప్పున ఒక సంవత్సరం పాటు ఎస్‌ఐపీ ఆపేస్తే, ఆపేసిన మొత్తం రూ. 2.4 లక్షలు. ఏడాదికి 12% సగటు రిటర్న్ వేసుకున్నా, రాబోయే 20 ఏళ్లలో చక్రవడ్డీ లాభంతో ఆ రూ. 2.4 లక్షలు కాస్తా రూ. 19 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఆపిన ఒక చిన్న సిప్‌ వల్ల భవిష్యత్తులో దాదాపు రూ. 20 లక్షలు రాబడిని కోల్పోతారు.

రూ. 5 లక్షలు విత్‌డ్రా చేస్తే:

ఈక్విటీ ఫండ్ నుండి రూ. 5 లక్షలు ఉపసంహరించుకుంటే, తదుపరి 10 ఏళ్లలో వచ్చే రూ. 15.5 లక్షల సంపదను మీరు కోల్పోయినట్లే.

లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన 4 విషయాలు:

అయితే రుణాలన్నీ అందరికీ సరిపోవు. రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేకపోతే, తాకట్టు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను బ్యాంకులు విక్రయించే ప్రమాదం ఉంది. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ 4 అంశాలను పరిశీలించండి:

  • మీ ఆర్థిక సమస్య ఎంతకాలం ఉండవచ్చు?
  • మీరు తీసుకునే రుణంపై వడ్డీ రేటు ఎంత?
  • మీ పెట్టుబడి కాలపరిమితి ఎంత?
  • మీకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంతవరకు ఉందా?

అత్యవసర పరిస్థితి చేస్తే క్రెడిట్ కార్డులు, అధిక వడ్డీ పర్సనల్ లోన్ల జోలికి వెళ్లకుండా మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం (LAMF) తీసుకోవడం లేదా తాత్కాలికంగా సిప్‌ పాజ్ మంచిది. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఏర్పాటు చేసుకోవడమే అసలైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

Auto Tips: ఏడాదిలో కారు, బైక్ కొనడానికి ఏ నెల అనుకూలం? వేల రూపాయలు ఆదా చేసే ట్రిక్స్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us