Fitness Tips: ఇలా చేస్తే చాలు.. జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఫిట్‌గా ఉండొచ్చు..
Weight Loss Tips: ఈ కరోనావైరస్ యుగంలో జిమ్‌కి వెళ్లడం కొంచెం కష్టంగా మారింది. అయితే ఇంట్లో ఉంటూ పెరుగుతున్న బరువును నియంత్రించడం కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో జిమ్ పరికరాలు లేకుండా ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఫిట్నెస్ చిట్కాలను పాటిస్తే.. బరువును అదుపులో ఉంచుకోవడంతోపాటు.. తగ్గొచ్చని సూచిస్తున్నారు.

Weight Loss
- పుష్ అప్స్ : ఈ వ్యాయామం చేయడం వల్ల భుజాలు, ఛాతీ, పొత్తికడుపులోని కొవ్వు తగ్గిపోయి అవి ఫిట్ గా మారడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు ఈ వ్యాయామం శరీరాన్ని లోపలి నుంచి దృఢంగా మార్చుతుంది.
- exercise
- హై నీ: ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. రోజంతా శరీరంలో శక్తి ఉండేలా చేస్తుంది. ఒకే చోట నిలబడి పరుగెత్తాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాళ్లను ఎంత పైకి లేపి ఎక్సర్సైజ్ చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. కావున తెలుసుకోని చేయడం ఉత్తమం.
- ఫ్రాగ్ జంప్: ఈ వ్యాయామంతో కొవ్వును కూడా కరిగించవచ్చు. దీని కోసం మీ పాదాలను భూమికి పూర్తిగా ఆనించాలి. ఆ తర్వాత స్క్వాట్ పొజిషన్‌కు వచ్చి.. లేచి నిలబడి ముందుకు దూకుతూ ఇలా మళ్లీ మళ్లీ చేస్తూ ఉండాలి. ఒక రోజులో దాదాపు 70 నుంచి 80 ఫ్రాగ్ జంప్‌లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
- స్క్వాట్ జంప్: ఈ వ్యాయామం చేయడం వల్ల బరువు సులువుగా తగ్గవచ్చు. లేచి నిలబడి జంప్ చేస్తూ.. చేతులను పైకి కిందకు, వెనుకకు కదిలిస్తూ ఉండాలి. ఈ సమయంలో మీ శరీరం నిటారుగా ఉండాలని పేర్కొంటున్నారు.









