AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఆహార పదార్ధాలు రెగ్యులర్ గా తీసుకోండి.. వృద్ధాప్య ఛాయలను సహజ పద్ధతుల్లో తగ్గించుకోండి..

Health Tips: వృద్ధాప్య ఛాయలు ఎవరికైనా ఇష్టం ఉండదు.. మహారాజు యయాతి వంటి వాడే. తనకు శాప వల్ల కలిగిన వృద్ధాప్యాన్ని కొడుకులకు ఇచ్చి.. తాను యవ్వనంలో ఉండి.. కోరికలను తీర్చుకోవాలని..

Health Tips: ఈ ఆహార పదార్ధాలు రెగ్యులర్ గా తీసుకోండి.. వృద్ధాప్య ఛాయలను సహజ పద్ధతుల్లో తగ్గించుకోండి..
Anti Aging Foods
Surya Kala
|

Updated on: Jan 22, 2022 | 11:49 AM

Share

Health Tips: వృద్ధాప్య ఛాయలు ఎవరికైనా ఇష్టం ఉండదు.. మహారాజు యయాతి వంటి వాడే. తనకు శాప వల్ల కలిగిన వృద్ధాప్యాన్ని కొడుకులకు ఇచ్చి.. తాను యవ్వనంలో ఉండి.. కోరికలను తీర్చుకోవాలని అనుకున్నాడు. అప్పట్లోనే వృద్ధాప్యం వద్దని ఇంత తపన పడితే.. ప్రస్తుత కాలంలో మరింత అధికంగా మనుషులు తమకు వృద్ధాప్య ఛాయలు వద్దు అనుకుంటున్నారు.. అందుకని తమకు వృద్ధాప్యం వస్తున్నట్లు అనిపిస్తే చాలు.. ఆనందం కోల్పోయినట్లు భావించడమే కాదు.. వృద్ధాప్య సంకేతాలనుంచి రక్షించుకోవడానికి రకరకాలు ప్రయత్నాలు చేస్తారు.. వచ్చిన ప్రతి యాడ్ ను ప్రయత్నిస్తుంటారు.. ఈ విషయంలో స్త్రీ, పురుష అనే బేధం ఉండదు.. తమకు నెరిసిన జుట్టు, ముడతలు, చర్మం పై గీతాలు.. వంటివి రాకుండా అనేక ప్రయత్నాలను చేస్తారు.. ఖర్చును భరించే వారు బ్యూటీ పార్లర్ లను ఆశ్రయిస్తారు.. కాగా వృద్ధాప్య సంకేతాలతో ఆందోళన పురుషుల కంటే స్త్రీల్లోనే ఎక్కువ అని గణాంకాలు తెలుపుతున్నాయి. కాగా 25 ఏళ్ళు నిండిన స్త్రీ, పురుషులు తమ వృద్ధాప్య సంకేతాలను సహజ పద్ధతుల్లో తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్ధాలు సహాయ పడతాయి.

*కోడి గుడ్డి సంపూర్ణ ఆహారం. కండరాల పటుత్వం పెంచుకోవాలను అనుకునే వారు గుడ్లు తింటే మంచిది. జుట్టు, చర్మ కణాలను ఎక్కువ కాలం యంగ్ ఉండాలి అంటే.. ప్రోటీన్లు అధికంగా ఉన్న కోడి గుడ్డు తినడం మంచిది.

*మెంతి ఆకు లో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను పునరుత్తేజం చేసి.. కణాల ప్రారంభ క్షీణతను నిరోధించి తద్వారా వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.

*అధిక పోషకాలు కలిగిన దానిమ్మ పండు ప్రతిరోజూ కనీసం 100 గ్రాములు తింటే స్త్రీలు ఎక్కువ కాలం అందంగా.. ముడతలు రాకుండా ఉండడానికి సహాయ పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎలాజిక్ ఆసిడ్ ఎక్కువగా కలిగి ఉన్న ఈ దానిమ్మను తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ డామేజ్ ని తగ్గించి ముడతలు.. వయసు వల్ల వచ్చే మచ్చలను నిరోధిస్తుంది.

* భారతదేశంలో బటర్ ఫ్రూట్ గా ప్రసిద్ధి చెందిన అవకడో… న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన పండు ని అధిక మొత్తంలో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవకడో లో ఉన్న ఒమేగా 3 ప్యాటీ ఆసిడ్లు చర్మాన్ని తేమగా ఉంచి ముడుతలు లేకుండా చేస్తుంది.. అంతేకాదు.. వీటిలో ఉన్న లీనోలిక్ ఆసిడ్ చర్మ కణాలను పోషించి.. ప్రారంభ క్షీణతను నిరోధిస్తుంది.

* పుచ్చకాయ లో వృద్ధాప్య ప్రక్రియ ను తగ్గించే అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పుచ్చకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ… చర్మ కణాలను మృదువుగా చేసి.. క్షీణతను అడ్డుకొంటుంది.

* బ్లూ బెర్రీస్ ను తినడం వల్ల అధిక కొవ్వును తగ్గించి.. గుండె ఆరోగ్యం ను మెరుగు పరుస్తుంది. దీనిలో ఉండే అధిక మైన యాంటీ ఆక్సిడెంట్లు… కొత్త చర్మం, జుట్టు కణాల ఉత్పత్తి ని పెంచడం ద్వారా.. ముడతలను ఫైన్ లైన్ లను నిరోధిస్తాయి.

*పెరుగును ప్రతి రోజూ తినడం అత్యంత శ్రేష్టం. అంతేకాదు పెరుగు వయసుని తగ్గించుకోవడానికి సహాయ పడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను, చర్మ కణాలను ధృడంగా చేసి ఎక్కువ కాలం అందంగా యవ్వనంగా ఉండేటట్లు చేస్తాయి.

* బాదం పప్పు ఆరోగ్యకరమైన ఆహారం.. అత్యధిక ప్రయోజనాలను పొందాలంటే.. వీటిని స్నాక్స్ గా తీసుకోవాలి.. బాదం పప్పులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన ఉంటుంది. ఈ రెండు పోషకాలు కొత్త చర్మ కణాలను పునరుత్పత్తిని చేసి స్త్రీలలో వృద్ధాప్యం లో వచ్చే సంకేతాలను తగ్గిస్తుంది.

*నిమ్మకాయ రసం తీసుకోవడం లేదా రోజూ తినే ఆహారంలో నిమ్మను జత చేయడం వల్ల చర్మ సౌందర్యం ఇముడిస్తుంది. చర్మం పై నిమ్మరసం తో రుద్దితే.. ముడతలు త్వరగా రాకుండా నివారిస్తుంది. అంతేకాదు వయసు వల్ల వచ్చిన మచ్చలు ఇతర వృద్ధాప్య ఛాయలు రాకుండా సహాయ పడుతుంది. నిమ్మలో అధికంగా ఉన్న విటమిన్ సి… చర్మం సున్నితంగా ఉండేటట్లు చేస్తుంది.

Also Read:  రోజూ క్యాబేజీ ఉడకబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..