Health: ఆరోగ్యానికి మంచిదని వెల్లుల్లి తెగ తింటున్నారా.? ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు..
Health: కరోనా పుణ్యామాని అందరి ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు లేని విధంగా కొత్త కొత్త ఆహారాలను అలవాటు చేసుకుంటున్నారు. కరోనాకు విరుగుడు అని సహజ ఆహారంవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా తీసుకుంటున్న వాటిలో వెల్లుల్లి..
Health: కరోనా పుణ్యామాని అందరి ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు లేని విధంగా కొత్త కొత్త ఆహారాలను అలవాటు చేసుకుంటున్నారు. కరోనాకు విరుగుడు అని సహజ ఆహారంవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా తీసుకుంటున్న వాటిలో వెల్లుల్లి ఒకటి. వెల్లులితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి మరి. అందుకే మనం చేసుకునే దాదాపు అన్ని వంటకాల్లో వెల్లుల్లిని ఓ భాగం చేశారు. ముఖ్యంగా ఇందులో ఉండే కాపర్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బీ1, ఐరన్‌లు ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆహారం రుచిని మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎలా పడితే అలా వెల్లుల్లిని తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదుర్కోక తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచి చేసే వెల్లుల్లితో కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* వెల్లుల్లిని ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే ఉన్నట్లుండి రక్తపోటు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా లో బీపీతో బాధపడేవారు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
* వెల్లుల్లి ఆహారానికి రుచిని ఇస్తుందనడంలో ఎంత నిజం ఉందో.. వాసన కూడా వస్తుందనడంలో అంతే నిజం ఉంది. నిత్యం వెల్లుల్లిని తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కేవలం నోటి దుర్వాసనే కాకుండా చమట వాసన కూడా దుర్గంధంగా మారే అవకాశం ఉంటుంది.
* వెల్లుల్లిలో ఎక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువ వెల్లుల్లి తీసుకునే వారి చాతిలో మంట ఏర్పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అసిడిటీ సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో వెల్లుల్లిని మోతాదుకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Science Facts: ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? కారణం మీకు తెలిసింది మాత్రం కాదు!
Covid 19: కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాకపోవచ్చు.. అయినా ప్రమాదం లేదంటున్న నిపుణులు