- Telugu News Photo Gallery Technology photos Now you can get iphone 11 smartphone with 15000 discount
iPhone 11: ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఐఫోన్11పై రూ. 15 వేలు డిస్కౌంట్ పొందే అవకాశం.. ఎలాగంటే..
iPhone 11: ఐఫోన్ 11 ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 15 వేలు ఆదా అయ్యే అవకాశం ఉంది..
Updated on: Jan 22, 2022 | 8:23 PM

యాపిల్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది కోరికతో ఉంటారు. అయితే ధర ఎక్కువ కారణంగా చాలా మంది దీనిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. కానీ తాజాగా ఐఫోన్11పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది..

ప్రస్తుతం ఐఫోన్ 11, 64 జీబీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 49,900గా ఉంది. అయితే హెచ్‌డీఎఫీస్ కార్డుతో ఈఎమ్ఐతో కొనుగోలు చేస్తే రూ. 4 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే పాత ఐఫోన్ మోడల్‌పై ఎక్స్ఛేంజీ ఆఫర్ కూడా అందిస్తోంది. ఐఫోన్ 7ను ఎక్స్ఛేంజీ చేసుకుంటే రూ. 11 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇలా మొత్తంగా ఐఫోన్ 11పై మొత్తం రూ. 15 వేల డిస్కౌంట్‌తో కేవలం రూ. 34,900కే యాపిల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చన్నమాట.

ఇక ఐఫోన్ 11పైనే కాకుండా ఇతర యాపిల్ ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇతర మోడల్స్‌పై కూడా ఎక్స్ఛేంజీ అందిస్తున్నాయి.




