Science Facts: ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? కారణం మీకు తెలిసింది మాత్రం కాదు!

Science Facts: ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? కారణం మీకు తెలిసింది మాత్రం కాదు!
Science Facts

సాధారణంగా మనం మన ప్రకృతి(Nature)లో ఉండే ఎన్నో వింతలను చూస్తుంటాం. ముఖ్యంగా ఎన్నో ఆసక్తికర జంతువులను చూస్తాం. చిన్నప్పటి నుంచి మనలను కొన్ని జీవరాశులు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అదేవిధంగా వాటిగురించి మనం వినే విషయాలు కూడా ఎప్పుడూ మనల్ని అబ్బుర పరుస్తూనే ఉంటాయి.

KVD Varma

|

Jan 22, 2022 | 8:52 PM

సాధారణంగా మనం మన ప్రకృతి(Nature)లో ఉండే ఎన్నో వింతలను చూస్తుంటాం. ముఖ్యంగా ఎన్నో ఆసక్తికర జంతువులను చూస్తాం. చిన్నప్పటి నుంచి మనలను కొన్ని జీవరాశులు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అదేవిధంగా వాటిగురించి మనం వినే విషయాలు కూడా ఎప్పుడూ మనల్ని అబ్బుర పరుస్తూనే ఉంటాయి. అయితే, జీవరాశుల విషయంలో మనం వినే అన్ని విషయాలు నిజాలు(Facts) కాదు అని తెలిసినపుడు అవునా! అని అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం విన్న విషయాలు పెద్దయ్యాకా మనం మన పిల్లలకూ చెబుతాం. అదేవిధంగా తరతరాలుగా జరుగుతూ వస్తోంది. దీంతో ఆ జీవరాశుల గురించి మనకు శాస్త్రీయం(Scientific)గా వివరంగా తెలిసినా అవి మనకు నమ్మలేని నిజాలుగా అనిపిస్తాయి. అటువంటి మూడు అబ్బురపరిచే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది?

ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలుసా? కచ్చితంగా తెలుసనే అంటారనే విషయం మాకు తెలుసు. కానీ, మీరేమని చెబుదామని అనుకుంటున్నారో అది మాత్రం నిజం కాదు. ఊసరవెల్లి రంగులు మార్చడానికి కారణం అది శత్రువుల నుంచి తప్పించుకోవడానికి అని మీరు అనుకుంటున్నారు.. అదే మీరు ఇప్పటివరకూ వింటూ వస్తున్నారు. అయితే, ఇది నిజం కాదు. అవును.. అవి వివిధ కారణాలతో అవి రంగులు మారుస్తాయి. నిజానికి, ఊసరవెల్లులు తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి .. ఇతర ఊసరవెల్లిలకు సంకేతాలు ఇవ్వడానికి తమ శరీర రంగును మారుస్తాయి. అవి ఒకదానితో ఒకటి సంభాషించడానికి .. శక్తిని చూపించడానికి ప్రకాశవంతమైన రంగులను వెలువరుస్తాయి. ఇతర ఊసరవెల్లిలతో పోరాటంలో, ఊసరవెల్లులు ముదురు రంగును సంతరించుకుంటాయి. ఊసరవెల్లిల మరొక లక్షణం వాటి కళ్ళు. ఊసరవెల్లులు ఏకకాలంలో వివిధ దిశల్లో చూడగలవు. అవి తప్ప మరే ఇతర సరీసృపాలకు లేని లక్షణం ఇది. అయితే, బల్లుల వలె కాకుండా, ఊసరవెల్లి తోక ఒకసారి తెగిపోతే తిరిగి పెరగదు.

గోల్డ్ ఫిష్ కి మతిమరుపు..

ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం కానీ.. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే, గోల్డ్ ఫిష్ కి మనకంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. ఒకసారి అది చూసిన విషయాన్ని 5 నుంచి 6 నెలల పాటు గుర్తుంచుకుంటుంది. అదేవిధంగా దానికి సమయ భావం .. స్థిరమైన దినచర్య ఉంటుంది. మూసి ఉన్న అక్వేరియంలలో నివసించే గోల్డ్ ఫిష్ తమ ఫుడ్ బాక్స్‌ని చూడగానే రెచ్చిపోవడం కనిపిస్తుంది. చుట్టుపక్కల అవి తమ యజమానిని చూస్తే, ఉత్సాహంతో నీటిలో నుంచి దూకడానికి కూడా ప్రయత్నిస్తాయి. అలాగే, గోల్డ్ ఫిష్ జీవిత కాలం కూడా ఎక్కువ. ‘టిష్’ అనే చేప పేరు గిన్నిస్ బుక్‌లో పురాతన గోల్డ్ ఫిష్‌గా నమోదైంది, దీని వయస్సు 43 సంవత్సరాలు. ప్రజలు తమ ఇళ్లలోని ఫెంగ్ షుయ్ అక్వేరియంలో గోల్డ్ ఫిష్‌లను ఉంచడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చైనాలోని ఫెంగ్ షుయ్ గ్రంథంలో వాటిని పవిత్రమైనవిగా భావిస్తారు. గోల్డ్ ఫిష్‌లను కూడా గుడ్‌లక్‌గా పరిగణిస్తారు. దక్షిణ ఐరోపాలో, మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, భర్తలు తమ భార్యకు గోల్డ్ ఫిష్‌ను బహుమతిగా ఇస్తారు.

గబ్బిలాలు చూడలేవు!

ఇదొక పెద్ద అపోహ మనకు. గబ్బిలం కళ్ళు కనిపించవనీ.. అవి గుడ్డివనీ పెద్ద నమ్మకం అందరికీ. కానీ..ఇది పూర్తిగా తప్పు. గబ్బిలాలు గుడ్డివి కావు, కానీ వాటి కళ్ళు చాలా చిన్నవి. వాటి కంటి చూపు బలహీనంగా ఉండటంతో వాటిని అంధులుగా భావించారు. అవి రాత్రి చీకటిలో మాత్రమే వేటాడేందుకు ఇష్టపడతాయి. కానీ మనుషులకు చీకటి తప్ప మరేమీ కనిపించని చీకటిలో గబ్బిలాలు తమ చిన్న కళ్లతో హాయిగా చూడగలవు. అలాగే, గబ్బిలాలకు వినికిడి సామర్థ్యం కూడా చాలా ఎక్కువ.

ఇంకా గబ్బిలాలు రక్తాన్ని పీల్చుకుంటాయనే విషయం కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. నిజం ఏమిటంటే చాలా జాతుల గబ్బిలాలు కీటకాలు, పండ్లు లేదా పుప్పొడిని తింటాయి. వీటిలో మూడు జాతులు మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే రక్తాన్ని పీల్చుకుంటాయి. అవి ఎక్కువ అమెరికాలో కనిపిస్తాయి. అవి మానవ రక్తాన్ని తాగడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అవి ఎక్కువగా ఇతర పక్షుల రక్తాన్ని పీల్చుకుంటాయి.

Also Read: Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 10 ఆహారాలను మీ డైట్‌లో చేర్చాల్సిందే..!

Fitness Tips: ఇలా చేస్తే చాలు.. జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఫిట్‌గా ఉండొచ్చు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu