AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. బుల్డోజర్లతో సైనిక స్థావరం కూల్చివేత!

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉగ్రవాదులు బరితెగించారు. నిర్మాణంలో ఉన్న ఒక ఉమ్మడి భద్రతా దళాల స్థావరాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనతో రాజధాని ఢాకాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మే 31న బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ ఈ సరికొత్త స్థావరాన్ని ప్రారంభించాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. బుల్డోజర్లతో సైనిక స్థావరం కూల్చివేత!
Bangladesh Rab Camps
Balaraju Goud
|

Updated on: May 26, 2026 | 11:28 AM

Share

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉగ్రవాదులు బరితెగించారు. నిర్మాణంలో ఉన్న ఒక ఉమ్మడి భద్రతా దళాల స్థావరాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనతో రాజధాని ఢాకాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మే 31న బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ ఈ సరికొత్త స్థావరాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఈ ఉగ్రదాడిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.

బంగ్లాదేశ్‌కు చెందిన ‘ది డైలీ స్టార్’ పత్రిక కథనం ప్రకారం.. సోమవారం (మే 25) తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. చిట్టగాంగ్‌లోని సీతాకుండ జిల్లా, సలీంపూర్ అడవిలో ఉన్న రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB), పోలీసుల సంయుక్త శిబిరంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆధునిక ఏకే-47 తుపాకులతో సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

సైన్యం ఎదురుదాడికి దిగేలోపే, ఉగ్రవాదులు తమ పక్కా ప్రణాళికను అమలు చేశారు. సైనిక వాహనాలు అడవిలోకి రాకుండా నిరోధించడానికి చుట్టుపక్కల రహదారులపై పెద్ద పెద్ద గుంతలు తవ్వారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సైనిక స్థావరాన్ని బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ సమయంలో శిబిరంలో కొద్దిమంది సైనికులు మాత్రమే ఉండటాన్ని వారు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ దాడి వెనుక ‘యాసిన్ ఫోర్స్’ అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు రాబ్-7 కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హఫీజుర్ ధృవీకరించారు. ఉగ్రవాదులను అడ్డుకోవడానికి తాము 90 రౌండ్ల కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించి, సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటన జరిగిన చిట్టగాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతం సుమారు 3,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇదంతా కొండలు, లోయలతో కూడిన దుర్భేద్యమైన ప్రాంతం కావడంతో, దీనిపై బంగ్లాదేశ్ సైన్యానికి పూర్తి నియంత్రణ లేదు. 2021లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఈ ‘యాసిన్ ఫోర్స్’ చాలా కాలంగా ఈ అడవులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ దుర్భేద్య ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి బంగ్లాదేశ్ సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?