Warangal: టిప్‌టాప్‌గా ఆటోలో చలివేంద్రానికి వచ్చాడు.. తీరా మంచినీళ్లు తాగుతాడనుకుంటే
బంగారం, డబ్బు, విలువైన వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పక్క ప్లాన్ వేసి దొంగిలించేవాళ్లను కామన్‌గా చూస్తుంటాం. కానీ వీడు అదో టైపు.. ఓ కుండను దొంగలించాడు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రంలో స్థానికులు ఏర్పాటు చేసిన కుండను దొంగిలించి వరంగల్‌లో..

బంగారం, డబ్బు, విలువైన వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పక్క ప్లాన్ వేసి దొంగిలించేవాళ్లను కామన్‌గా చూస్తుంటాం. కానీ వీడు అదో టైపు.. ఓ కుండను దొంగలించాడు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రంలో స్థానికులు ఏర్పాటు చేసిన కుండను దొంగిలించి వరంగల్‌లో హాట్ హాట్ చర్చగా మారాడు. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన ఆ కుండ చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విచిత్ర సంఘటన వరంగల్‌లోని నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం స్థానికులు ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మానిటరింగ్ కోసం సీసీ కెమెరాలు కూడా అమర్చారు.
అయితే ఆ కుండపై కన్నేసిన ఓ ఆటో డ్రైవర్ కాసేపు అక్కడ రెక్కి నిర్వహించాడు. ఆటోలో వచ్చి చకచకా కుండను ఎత్తుకుపోయాడు. తన ఆటోలో పెట్టుకొని ఎస్కేప్ పోయాడు. ఆ కుండలో నీళ్లను నింపడం కోసం వచ్చిన చలివేంద్రం నిర్వాహకులు కుండ కనిపించకపోవడంతో షాక్ అయ్యారు. సీసీ కెమెరాల్లో చూసి ఖంగుతిన్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో వచ్చి కుండను దొంగిలించడం విజువల్స్ చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే వేసవి ప్రభావంతో కుండ కొనుక్కోవాలని పేదరికంతో ఉండడం వల్లే ఈ కుండను దొంగిలించి ఉంటాడని కామ్‌గా ఊరుకున్నారు. కానీ సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
