KTR: దూకుడుగా ప్రచారం చేస్తోన్న ప్రధాన అభ్యర్ధులు.. మరి సిరిసిల్లలో ప్రజల తీర్పు ఎటు వైపో.?
సిరిసిల్లలో రసవత్త పొరు నెలకొంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ ప్రచారంలో దూకుడు పెంచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుండి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లక్ష మెజారిటీతో విజయం సాధిస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ నుండి కెకె మహేందర్ రెడ్డి, బీజేపి నుండి రాణి రుద్రమ బరిలో ఉన్నారు. అయితే పద్మశాలి వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ ఇండిపెండెంట్‌గా బరిలొ దిగుతున్నారు.

సిరిసిల్లలో రసవత్త పొరు నెలకొంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ ప్రచారంలో దూకుడు పెంచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుండి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లక్ష మెజారిటీతో విజయం సాధిస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ నుండి కెకె మహేందర్ రెడ్డి, బీజేపి నుండి రాణి రుద్రమ బరిలో ఉన్నారు. అయితే పద్మశాలి వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ ఇండిపెండెంట్‌గా బరిలొ దిగుతున్నారు.
సిరిసిల్లలో ప్రజల తీర్పు ఎటు..?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల వేడి మొదలు అయ్యింది. అందరి దృష్టి సిరిసిల్ల అసెంబ్లీ పైనే ఉంది. కేటీఆర్ సిరిసిల్ల నుండి ఐదవ సారి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికలలో ఎనభై తొమ్మిది వేలకి పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇప్పుడు మెజారిటీ సాధిస్తారా.. లేకుంటే ప్రతిపక్షాలు దూకుడుగా వెళ్తయా.. ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములని నేత కార్మికులే ప్రభావం చూపుతారు. సుమారుగా అరవై ఐదు వేలకి పైగా నేత కార్మికుల ఓట్లే ఉన్నాయి. గత ఎన్నికలో బీఆర్ఎస్‌కే తొంభై శాతానికి పైగా ఓట్లు వేసారు. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణలపై ప్రతిపక్షాలు దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ నుండి కెకె మహేందర్ రెడ్డి, బీజేపి నుండి రాణిరుద్రమ బరిలో ఉన్నారు. ఇక్కడ నేత కార్మికులు అధికంగా ఉన్నప్పటికి ఆ సామాజికవర్గానికి ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వక పోవడంతో అసంతృప్తి గా ఉన్నారు. దీంతో బీజేపి టికెట్ ఆశించి భంగపడ్డ లగిశెట్టి శ్రీనివాస్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. కేటిఆర్ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది.
కేటీఆర్ ఇప్పటికే ప్రచారాన్ని వేగవంతం చేసారు. కేసీఆర్ ఇక్కడ బహిరంగ సభలో పాల్గోన్నారు. సిరిసిల్ల లో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ విజ్ఙప్తి చేశారు. కేటీఆర్ కూడా వీలైనంత రోడ్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్యాడర్ ఉత్సాహం నింపేందుకు ప్రతిరోజు టెలి కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారు. సెకండ్ క్యాడర్ అసంతృప్తిగా ఉన్న వారితో నేరుగా మాట్లాడుతున్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్ళలో చెసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి గతంలో పొటీ చేసారు. దీంతో మరోసారి కేటీఆర్‌ని ఢీ కొట్టడానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్ అరు గ్యారంటీలని ప్రజలకి వివరిస్తున్నారు. అదే విధంగా చేరికలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ ఇక్కడి నుండే పోటి చేస్తున్నారు. స్థానిక నేతలు కాకుండా ఈమెకి టికెట్ ఇవ్వడంతో క్యాడర్ విస్మయానికి గురి అయ్యింది. అయితే అందరిని కలుపుకుంటూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, కేటీఆర్‌ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రతిపక్షాలు చెప్పే అబద్దాలని ప్రజలు వినే పరిస్థితి లేదని బీఅర్ఎస్ తిప్పికొడుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




