Telangana: హెలికాప్టర్ల కోసం మన నాయకులు ఇంత ఖర్చు చేస్తున్నారా.? ఒక్క ట్రిప్‌కు..

ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో జాతీయస్థాయి నేతలందరూ ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. అటు బీజేపీ మొదలుకొని కాంగ్రెస్ స్థానిక బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుల సైతం పర్యటించాల్సి వస్తే ప్రైవేట్ హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ప్రైవేట్ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని సందర్భాల్లో గంటల వ్యవధిలోనే నేతలు వేరే ప్రాంతానికి...

Telangana: హెలికాప్టర్ల కోసం మన నాయకులు ఇంత ఖర్చు చేస్తున్నారా.? ఒక్క ట్రిప్‌కు..
election campaign in helicopter
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Nov 09, 2023 | 8:00 PM

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా హెలికాప్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎన్నికల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న బడా నేతలందరు ప్రైవేట్ హెలికాప్టర్ల ద్వారా పర్యటిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతల సైతం ప్రైవేట్ హెలికాప్టర్ల ద్వారా పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో హెలికాప్టర్ల తాకిడి మరింత ఎక్కువైంది.

ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో జాతీయస్థాయి నేతలందరూ ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. అటు బీజేపీ మొదలుకొని కాంగ్రెస్ స్థానిక బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుల సైతం పర్యటించాల్సి వస్తే ప్రైవేట్ హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ప్రైవేట్ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని సందర్భాల్లో గంటల వ్యవధిలోనే నేతలు వేరే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం నేతలు ప్రైవేట్ హెలికాప్టర్లనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

ఒక్కో హెలికాప్టర్‌ను బట్టి రెంటల్ రేటును డిసైడ్ చేస్తున్నారు ట్రావెల్ ఏజెన్సీస్. ట్రావెల్ చేసే ప్రయాణికుల సంఖ్యను బట్టి హెలికాప్టర్ లను ట్రావెల్ ఏజెన్సీస్ కేటాయిస్తాయి. ఉదాహరణకు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా నేతలు ఒకే రోజు 3,4 సభల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో రోడ్డు మార్గాన వెళ్లడం అసాధ్యం కాబట్టి ప్రైవేట్ హెలికాప్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు నేతలు. ఒక హెలికాప్టర్‌ను గంటకు రూ. 2 లక్ష రూపాయల నుంచి మొదలుకొని రూ. 5 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ గంటకు రూ. 1 లక్ష 50 వేల రూపాయలు ఉండగా డబల్ ఇంజిన్ హెలికాప్టర్లకు అయితే గంటకు రూ. 2 లక్షల 75 వేల రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు.

అది కూడా ట్రావెల్ చేసే వ్యక్తుల సంఖ్యను బట్టి రేట్ మారుతూ ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో ప్రైవేట్ హెలికాప్టర్లు అప్పటికప్పుడు దొరకడం కాస్త కష్టంగా మారింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే చాలామంది నేతలు సంబంధిత తేదీల్లో హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారు. అయితే అందులో ప్రయాణించే వ్యక్తిని బట్టి ఇంజన్‌లను ట్రావెల్ ఏజెన్సీస్ ఏర్పాటు చేస్తాయి.

ఎలక్షన్ క్యాంపెయినింగ్‌ కోసం కొన్ని ప్రత్యేక హెలికాప్టర్ చాటర్ సర్వీస్‌లను ట్రావెల్ ఏజెన్సీస్ ప్రవేశపెట్టాయి. తక్కువ సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు హెలికాప్టర్లే అనువైన రవాణా మార్గం కాబట్టి ప్రముఖ నేతలు అందరూ ప్రైవేట్ హెలికాప్టర్లను వాడుతున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో హెలికాప్టర్లలో లీడర్లు వస్తే ఆ లీడర్ కు ఏర్పడే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. హెలికాప్టర్లలో ట్రావెల్ చేసే విఐపి, వివీఐపిల కోసం ప్రత్యేక భద్రతతో పాటు, వారికి కావాల్సిన లగ్జరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ స్టార్ కంపెనైర్‌ను మొదలుకొని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాకా అందరూ ప్రైవేట్ హెలికాప్టర్ లోనే పర్యటిస్తున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ పర్యటనలు ఒకే వారంలో రెండుసార్లు హెలికాప్టర్లు మొరాయించిన విషయం తెలిసిందే. సీఎం పర్యటించిన రెండు ప్రాంతాల్లో సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్లను వదిలి రోడ్డు మార్గాన సీఎం కేసీఆర్ పర్యటించాల్సి వచ్చింది. మరోవైపు రానున్న 20 రోజుల్లో 70 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోసం ప్రైవేట్ హెలికాప్టర్‌ను బుక్ చేశారు. నవంబర్ 28 వరకు వివిధ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీంతో రోడ్డు మార్గాన వెళ్లటం వీలుకాదు కాబట్టి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లనున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటల, డీకే అరుణ ఇప్పటి వరకు హెలికాప్టర్లను వాడారు. రానున్న రోజుల్లో ప్రచారం ఉదృతం అవుతుంది కాబట్టి మరిన్ని హెలికాప్టర్స్ గాలిలో ఎగిరేందుకు సిద్ధవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..