Sankranti Traffic: పండక్కి ఊరెళ్లవారికి బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో పట్టణవాసులు అంతా పల్లె బాటలు పట్టనున్నారు. అయితే హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు రెగ్యులర్‌గా వెళ్లే మార్గాల్లోంచి సిటీ దాటాలంటే సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. అలా కాకుండా ఈ రూట్‌లలో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు నుంచి తప్పించుకోవచ్చు. ఆ రూట్స్ ఏవో చూద్దాం పదండి.

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. శనివారం మధ్యాహ్నం స్కూల్స్ ముగిసిన తర్వాత హైదరాబాద్ నుంచి చాలా మంది సొంతూళ్లకు వెళ్లే ప్లాన్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి భారీగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఈ ట్రాపిక్ బారీన పడకుండా మీరు సిటీ దాటాలంటే మీరు రెగ్యులర్ వెళ్లే రూట్స్ కాకుండా కొత్త రూట్లను అన్వేషించండిని పోలీసులు చెబుతున్నారు. నార్మల్‌గా హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే వారికి చౌటుప్పల్‌కు చేరుకోవడానికి సుమారు గంట పడుతుంది. కానీ ప్రస్తుతం పండగ సీజన్, అలాగే హైదరాబాద్- విజయవాడ హైవేపై అండర్‌పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనుల నేపథ్యంలో సుమారు 3-4గంటల సమయం పడుతుంది. కాబట్టి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
మీరు ఈ మార్గాల ద్వారా సిటీ దాటవచ్చు
గంటూరు వైపు వెళ్లే వారు
నార్మల్‌గా హైదరాబాద్ నుంచి గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా నార్కట్‌పల్లి దాకా వెళ్లి అక్కడి నుంచి అద్దంకి హైవే మీదుగా వెళ్తుంటారు. కానీ మీరు విజయవాడ హైవే మీదుగా వెళ్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్‌లో చిక్కుకొనే అవకాశం ఉంది. కాబట్టి 10-20 కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు త్వరగా మీరు గమ్యస్థానాలు చేరుకోవాలి అనుకుంటే హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లొచ్చు. ఇందుకోసం ORR మీదుగా వెళ్లి బొంగుళూరు ఎగ్జిట్ వద్ద నుంచి నాగార్జునసాగర్ హైవై మీదుగా వెళ్లొచ్చు.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారు
ఇక విజయవాడ, ఖమ్మం వైపు ప్రయాణించే వారు భువనగిరి, రామన్నపేట గుండా చిట్యాలకు వెళ్లవచ్చు, మీరు ఒక్క నార్కట్‌పల్లి దాటితే ఇక మీకు ట్రాఫిక్ సమస్య ఉండకపోవచ్చు.
హైదరాబాద్- భువనగిరి వైపు
మీరు సిటీ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లి ఘట్‌కేసర్ వద్ద ఎగ్జిట్ అయి.. వరంగల్ హైవేలోకి ఎంట్రీ అవ్వచ్చు. అలా కాదంటే మీరు ఉప్పల్, ఘట్‌కేసర్ రూట్‌లో కూడా భువనగిరికి వెళ్లొచ్చు.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించగలరు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
