AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా.? చూస్తే ఆశ్చర్యపోతారు అంతే.!

కాకి రూపంలో ఉన్న ఓ పక్షి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓ ఇంటిపై వాలిన ఆ పక్షి శ్వేత వర్ణంలో తళుక్కున మెరుస్తూ కనిపించడంతో ఏంటా పక్షి అని అందరు పోటీపడి చూశారు. తెల్లగా ఉన్న ఆ పక్షిని చూసిన కొందరు పావురం అనునుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది అది పావురం కాదు.. కాకి అని.. తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్‌లో చోటు చేసుకుంది.

Telangana: తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా.? చూస్తే ఆశ్చర్యపోతారు అంతే.!
White Crow
Naresh Gollana
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 28, 2025 | 1:00 PM

Share

మన ఇంటి ముందు కావ్.. కావ్.. అని అరుస్తుంటే.. ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు అనుకుంటాం. అలాగే పిండాలు పెట్టినప్పుడు కాకులను పిలుస్తూంటాం కదా. అలాంటిది ఓ తెల్లటి రంగులో ఉన్న కాకి మీకు‌ దర్శనమిస్తే.. మీ ఇంటి ముందుకొచ్చి కావ్ కావ్ మని అరిస్తే.. అదే జరిగింది మంచిర్యాల జిల్లాలోని తాండూర్‌లో‌. మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని ఓ ఇంటి వద్ద తాజాగా ఓ తెల్ల రంగు హౌస్ క్రో(దేశీయ కాకి) కనిపించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హెచ్వైటీఐసీఓఎస్) సభ్యుడు, వన్యప్రాణి పరిరక్షకుడు శ్రీపతి వైష్ణవ్ స్పష్టం చేశారు. జిల్లాలో పూర్తి తెల్లకాకి కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు శ్రీపతి వైష్ణవ్. కవ్వాల్ అభయారణ్యంలో భాగమైన జిల్లాలోని సింగరేణి గనుల ప్రాంతంలో ఈ పక్షి కనిపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉందని. దీని వల్ల పక్షి రెక్కలు పూర్తిగా తెల్లగా మారినప్పటికీ కళ్ల రంగు సహజంగా ఉందన్నారు. అల్బినిజంలో కళ్లతో సహా శరీరమంతా తెల్లబడుతుంది. కానీ ల్యూసిజంలో కళ్లు సాధారణంగా ఉంటాయని. ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా అని తెలిపారు శ్రీపతి. సహజత్వానికి భిన్నంగా ఉన్న రూపం వల్ల ఇతర కాకులతో సంబంధాలు, సంతాన ఎంపిక ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుందని.. అయినప్పటికీ చాలా తెలివైన కాకులు వాటి సామాజిక బంధాలు, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వల్ల ఆ ఇబ్బందులను అధిగమిస్తాయన్నారు శ్రీపతి. తెల్లరంగు కాకి ఎక్కువ కాలం జీవించడం కష్టమే అన్నారు. తాండూర్ మండల ప్రాంతంలో ఇది కనిపించడం తొలి సారి అని పేర్కొన్నారు.

మనకు నల్లని రంగుతో అందరికీ సుపరిచితమైన కాకీ.. అరుదుగా తెల్ల రంగులో కనిపించినప్పుడు, అది కేవలం అరుదుగానే కాకుండా, శాస్త్రీయ దృక్కోణం నుంచి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు శ్రీపతి. నిజానికి, తెల్ల కాకి అనేది వేరే జాతికి చెందిన పక్షి కాదు. ఇది ఒక జన్యు లోపం ఫలితం. శాస్త్రీయ భాషలో దీన్ని అల్బినిజం లేదా ల్యూసిజం అని అంటారు. అల్బినిజంలో శరీరం ‘మెలనిన్’ అనే వర్ణద్రవ్యాన్ని తగినంతగా ఉత్పత్తి చేయదు. ఈ మెలనిన్ లేకపోవడం వల్ల చర్మం, వెంట్రుకలు, ఈకలు, కళ్ళ రంగు తెలుపు లేదా గులాబీ రంగులో కనిపిస్తుంది. ల్యూసిజంలో మాత్రం కేవలం ఈకలు మాత్రమే తెలుపు రంగులో మారతాయి, కానీ కళ్ళ రంగు మాత్రం సాధారణంగానే ఉంటుంది. తాండూర్ లో కనిపించిన కాకి ఈ జన్యు లోపంతో పుట్టినదే అని పక్షి నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ ఇలాంటి అరుదైన పక్షి ఇదే ప్రాంతంలో పదేపదే కనిపిస్తే, స్థానిక అటవీ శాఖ దానిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలంటున్నారు. ఈ అరుదైన పక్షిని సంరక్షించడం మన బాధ్యత మాత్రమే కాదు, అది శాస్త్రీయ అధ్యయనానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ అంటున్నారు నిపుణులు.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి